News March 23, 2025

అమెరికాలో మెడికల్ సీటు సాధించిన ఖమ్మం విద్యార్థి

image

ఖమ్మం నగరానికి చెందిన రాజావాసిరెడ్డి నేహాశివాని అమెరికాలోని ప్రతిష్టాత్మక వెస్ట్ వర్జీనియా విశ్వవిద్యాలయంలో ఎండీ జనరల్ మెడిసిన్ విభాగంలో పీజీ సీటు సాధించారు. శుక్రవారం విడుదల చేసిన ఫలితాలలో శివాని ఈ ఘనత సాధించారు. వివిధ దశలలో నిర్వహించే మెడికల్ లైసెన్సింగ్ ప్రవేశ పరీక్షలు, ఇంటర్వ్యూలో అత్యుత్తమ ప్రతిభను కనబరచి మొదటి ప్రయత్నంలోనే వెస్ట్ వర్జీనియా విశ్వవిద్యాలయంలో సీటు సాధించడం విశేషం.

Similar News

News December 1, 2025

అధికారుల వాట్సాప్ గ్రూప్‌లో బాపట్ల రైతులు..!

image

తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రైతులు వారి సమస్యలను ఉన్నతాధికారులకు చెప్పుకునేందుకు రైతులతో కూడిన వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. రైతులు వారి సమస్యలను వాట్సాప్ గ్రూప్‌లో పెట్టే విధంగా అవగాహన కల్పించాలన్నారు. సోమవారం ఆయన వ్యవసాయ శాఖ అధికారుల సమావేశంలో సూచించారు.

News December 1, 2025

జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు: పోలీస్ కమిషనర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు అక్రమ రవాణా నియంత్రణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టామని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. అర్ధరాత్రి సమయాల్లో అనుమానిత వ్యక్తుల వివరాలు, వేలిముద్రలను అధికారులు తనిఖీ చేస్తున్నారు. విజిబుల్ పోలీసింగ్‌ను పటిష్టంగా అమలు చేస్తేనే నేరాలు నియంత్రణలో ఉంటాయని, గస్తీ, పెట్రోలింగ్‌ను ముమ్మరం చేస్తున్నారని ఆయన తెలిపారు.

News December 1, 2025

తగ్గుతున్న GST ఆదాయ వృద్ధి!

image

TG: రాష్ట్రంలో జీఎస్టీ ఆదాయం క్రమేణా తగ్గుముఖం పడుతోంది. NOVలో ₹3910 కోట్ల GST వసూలైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 2024 NOVలో వచ్చిన ₹3880 కోట్ల ఆదాయంతో పోలిస్తే దాదాపు 1% పెరిగింది. అయితే అయితే ఇటీవల గణాంకాలను పరిశీలిస్తే నెలనెలా పెరగాల్సిన ఆదాయం తగ్గుముఖం పడుతోందని అధికారులు పేర్కొంటున్నారు. GST-2.O అమలు చేసినప్పటి తరువాత నుంచి ఈ పరిస్థితి కనిపిస్తోందని వారు చెబుతున్నారు.