News March 23, 2025
అమెరికాలో మెడికల్ సీటు సాధించిన ఖమ్మం విద్యార్థి

ఖమ్మం నగరానికి చెందిన రాజావాసిరెడ్డి నేహాశివాని అమెరికాలోని ప్రతిష్టాత్మక వెస్ట్ వర్జీనియా విశ్వవిద్యాలయంలో ఎండీ జనరల్ మెడిసిన్ విభాగంలో పీజీ సీటు సాధించారు. శుక్రవారం విడుదల చేసిన ఫలితాలలో శివాని ఈ ఘనత సాధించారు. వివిధ దశలలో నిర్వహించే మెడికల్ లైసెన్సింగ్ ప్రవేశ పరీక్షలు, ఇంటర్వ్యూలో అత్యుత్తమ ప్రతిభను కనబరచి మొదటి ప్రయత్నంలోనే వెస్ట్ వర్జీనియా విశ్వవిద్యాలయంలో సీటు సాధించడం విశేషం.
Similar News
News April 17, 2025
WNP: ‘విశ్వకర్మ లబ్ధిదారులకు అమౌంట్ జమ చేయాలి’

ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకంలో భాగంగా జిల్లాలో ట్రైనింగ్ పూర్తిచేసిన 400 మందికి వారి అకౌంట్లో రూ.1,00,000 జమ కాలేదని కోరుతూ బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్ గురువారం జిల్లా పరిశ్రమల శాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా ఇంకా ఆన్‌లైన్‌లో చాలామంది దరఖాస్తు చేసుకున్నారని, వారికి ట్రైనింగ్ ఇవ్వాలని కోరారు.
News April 17, 2025
పాలమూరు యూనివర్సిటీలో సకోర అభియాన్ కార్యక్రమం

సకోర అభియాన్ కార్యక్రమంలో భాగంగా పాలమూరు యూనివర్సిటీ రిజిస్టర్ రమేశ్ బాబు పక్షులకు నీటి తొట్లు అందించి జీవారణాన్ని కాపాడాలన్నారు. పీజీ ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. వచ్చే ఎండాకాలంలో పశుపక్షాదులకు నీటిని, ఆహారాన్ని అందిస్తూ ప్రాణకోటిపై దయా హృదయంతో మెలగాలని విద్యార్థులకు సూచించారు. ప్రకృతిలో ఎన్నో జీవరాశులు అంతమవడానికి పరోక్షంగా మానవాళి చర్యలే కారణమన్నారు. ఇందులో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
News April 17, 2025
కేంద్ర హోంమంత్రి చేతులు మీదుగా పురస్కారం అందజేత

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ రైజింగ్ డే పరేడ్ గురువారం మద్యప్రదేశ్‌లో జరిగింది. ఈ వేడుకలలో విశాఖకు చెందిన సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అరాధ్యుల శ్రీనివాస్‌కు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ అవార్డు లభించింది. ఈ అవార్డును శ్రీనివాస్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అందజేశారు. 34 ఏళ్లకు పైగా దేశ భద్రతకు ఆయన చేసిన సేవలకి గాను ఈ పురస్కారం లభించింది.