News June 11, 2024
అమెరికాలో విజయోత్సవ వేడుకలు.. పాల్గొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1718083449466-normal-WIFI.webp)
ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అమెరికాలోని అట్లాంటా నగరంలో పర్యటించారు. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడవసారి ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా అట్లాంటా నగరంలో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ సంస్థ నిర్వహించిన (NDA) విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. గత 10 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధిని చూసి మరోసారి BJP పార్టీని ప్రజలు ఆశీర్వదించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Similar News
News February 11, 2025
బాల్కొండ: పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739263374597_50486028-normal-WIFI.webp)
బాల్కొండలోని బాలికల మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను కిచెన్, డైనింగ్ హాల్‌లను కలెక్టర్ పరిశీలించారు. బాలికల కోసం వండిన అన్నం, పప్పు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. బియ్యం నిల్వలు, సరుకుల స్టాక్‌ను పరిశీలించారు. భోజనం ఎలా ఉంటుందని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. తాజా కూరగాయలు వినియోగించాలని, ఆహార పదార్థాలు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు.
News February 11, 2025
నాగిరెడ్డిపేట: కుంభమేళాకు వెళ్లి విగతజీవిగా వచ్చాడు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739254490210_1043-normal-WIFI.webp)
నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం గ్రామానికి చెందిన మంగళ్ శంకర్ (40) కుటుంబీకులతో కలిసి కుంభమేళాకు వెళ్లి విగతజీవిగా తిరిగివచ్చాడు. 5 రోజుల క్రితం ప్రయాగ్ రాజ్‌లోని కుంభమేళాకు వెళ్లాడు. అక్కడ గుండెపోటు రావడంతో వెంటనే లక్నోలోని ఓ ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఇవాళ ఉదయం మృతదేహం స్వగ్రామానికి చేరడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.
News February 11, 2025
జక్రాన్‌పల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739242161353_1043-normal-WIFI.webp)
నిజామాబాద్ జిల్లా 44 నంబర్ జాతీయ రహదారిపై సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. జక్రాన్‌పల్లి మండలం పడకల్ వద్ద ట్రాక్టర్‌ను కంటైనర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో రాజేశ్వర్, ఓడ్డేన్న మృతి చెందగా.. విజయ్ గౌడ్, మహేశ్ తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.