News October 16, 2024
అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన ఓ సాప్ట్‌వేర్ ఇంజినీర్ అమెరికాలో కన్నుమూశారు. ఓజిలి మండలం రాజుపాలేనికి చెందిన రవీంద్ర మెస్ యజమాని తిరుమూరు రవీంద్ర కుమారుడు గోపి అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఈక్రమంలో అమెరికాలోని రాడాల్ఫ్ సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో అక్కడి కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం మృతిచెందారు. స్నేహితులతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది.
Similar News
News November 25, 2025
మేయర్ స్రవంతి వైసీపీలో లేదు: కాకాణి

నెల్లూరు నగర మేయర్ అవిశ్వాస తీర్మానంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెడుతున్నట్లు టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఖండించారు. ‘ఆమె మా పార్టీకి ఎప్పుడో రాజీనామ చేశారు. కానీ ఆమె మా పార్టీలో ఉన్నట్లు టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. అమాయక గిరిజన మహిళను గద్దె దించడానికి అధికార పార్టీ నాయకులు అవినీతి నిందలు వేయడం తగదు’ అని పేర్కొన్నారు.
News November 25, 2025
కోటంరెడ్డి సోదరుడి కుమార్తె సంగీత్‌లో భారత క్రికెటర్

టీడీపీ నేత, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరుడి కుమార్తె హరిణ్యా రెడ్డికి గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌తో మరో రెండు రోజుల్లో వివాహం జరగనుంది. తాజాగా జరిగిన సంగీత్ వేడుకకు రాహుల్ సిప్లిగంజ్ టీం ఇండియా స్పిన్నర్ చాహల్‌ను ఆహ్వానించారు. దీంతో ‘‘నేను చాహల్‌కి వీరాభిమానిని. ఆయన మన సంగీత్‌కు వచ్చారంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నా’’ అంటూ హరిణ్య పోస్టు చేశారు.
News November 25, 2025
ఉదయగిరి: ఇల్లు కట్టుకునేవారికి రూ.2.50 లక్షలు

సీఎం చంద్రబాబు సొంత ఇల్లులేని నిరుపేదలందరికీ సొంత ఇల్లు నిర్మించాలని ఉద్దేశంతో పక్కా గృహాలు మంజూరు చేస్తున్నారని ఉదయగిరి నియోజకవర్గ TNTUC అధ్యక్షుడు బొజ్జ శ్రీనివాసులు (గణ) ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నేతృత్వంలో మండలంలోని ప్రతి పేద ఇల్లు నిర్మించుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా రూ.2.50 లక్షలు మంజూరు చేస్తారన్నారు. వివరాలకు సచివాలయంలో సంప్రదించాలన్నారు.


