News August 25, 2024
అమెరికాలో సూర్యాపేట జిల్లా వాసి మృతి

అమెరికాలో స్విమ్మింగ్ ఫూల్లో పడి సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం పాతర్లపాడుకు చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి మృతిచెందాడు. స్థానికుల వివరాలిలా.. గ్రామానికి చెందిన తాప్సీ ప్రవీణ్ అమెరికాలో టీచర్‌గా పనిచేస్తున్నాడు. ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ ఫూల్లో పడి చనిపోయాడు. అతనికి భార్య, పిల్లలు ఉన్నారు. ప్రవీణ్ తల్లిదండ్రులు పాతర్ల పహాడ్‌లో నివాసముంటున్నారు.
Similar News
News October 30, 2025
సైకిల్ ర్యాలీని ప్రారంభించిన ఎస్పీ శరత్ చంద్ర పవార్

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవర్ సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. ఎన్.జి. కళాశాల నుంచి క్లాక్ టవర్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో పోలీస్ సిబ్బంది, విద్యార్థులతో కలిసి ఆయన పాల్గొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో అమరులైన పోలీసుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ వారి ఆత్మ శాంతికి ప్రార్థనలు చేశారు.
News October 30, 2025
నల్గొండ: మగ్గం వర్క్‌లో ఉచిత శిక్షణ

నల్గొండ శివారు రాంనగర్‌లోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో గ్రామీణ నిరుద్యోగ మహిళలకు మగ్గం వర్క్‌లో 31 రోజుల ఉచిత శిక్షణ అందజేస్తున్నామని సంస్థ డైరెక్టర్ రఘుపతి తెలిపారు. శిక్షణలో ఉచిత టూల్ కిట్, వసతి, భోజనం కల్పిస్తామన్నారు. 18 సం. నుంచి 45 లోపు ఉమ్మడి నల్గొండకు చెందిన వారు అర్హులని తెలిపారు. ఆసక్తి గల వారు నవంబర్ 3 లోపు అప్లై చేసుకోవాలన్నారు.
News October 30, 2025
NLG: అందరిదీ అదే పరిస్థితి.. ఆలోచన విధానం మారితేనే మంచిది!

శాలిగౌరారం (M) పెర్కకొండారంకు చెందిన బలరాం అనే రైతు 10 ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. రూ.4లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఇప్పటి వరకు ఆయనకు 15 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. అంటే సుమారు 3 లక్షలు నష్టపోయాడు. పత్తి సాగు చేస్తే లాభాలు గడించొచ్చని అనుకున్నారు. కానీ తీరా చూస్తే నష్టాలే మిగిలాయి. అతనొక్కడిదే కాదు దాదాపు అందరిదీ ఇదే పరిస్థితి. రైతులు తమ ఆలోచన విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరముంది.


