News January 29, 2025

అమెరికాలో HYD వాసి మృతి.. పూర్తి వివరాలు

image

USలో జరిగిన యాక్సిడెంట్‌లో HYD వాసి వాజిద్ మృతి చెందిన సంగతి తెలిసిందే. వాజిద్ ఖైరతాబాద్ మం. MSమక్తా వాసి. SEC వెస్లీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు. రాజకీయాల్లో ఆసక్తి ఉండడంతో యూత్‌ కాంగ్రెస్‌లో చేరాడు. హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా పని చేశాడు. NRI కాంగ్రెస్ కమిటీ మెంబర్‌గాను ఉన్నాడు. హయ్యర్ స్టడీస్ కోసం US వెళ్లి అక్కడే జాబ్ చేస్తున్నాడు. బుధవారం ఉ. రోడ్డు ప్రమాదంలో చనిపోవడం బాధాకరం.

Similar News

News March 14, 2025

దైరతుల్ మారిఫిల్ డైరెక్టర్‌గా ప్రొ. షుకూర్

image

ఉస్మానియా యూనివర్సిటీలోని దైరతుల్ మారిఫిల్ ఉస్మానియా డైరెక్టర్‌గా ప్రొ. ఎస్ఏ షుకూర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు ఓయూ వీసీ ప్రొ. కుమార్ నియామక పత్రాన్ని అందజేశారు. పురాతన తాళపత్ర గ్రంథాలు, అరబిక్ గ్రంథాలను భద్రపరిచేందుకు నిజాంపాలనలో నెలకొల్పిన ఈ కేంద్రం ఓయూకు అనుబంధంగా పనిచేస్తోంది. ఇప్పటివరకు డైరెక్టర్‌గా పనిచేసిన షుకూర్ తిరిగి అదే పదవిలో నియమితులయ్యారు.

News March 14, 2025

HYDలో ప్రప్రథమ శారీ డ్రాపింగ్ ఈవెంట్.. @మాంగళ్య షాపింగ్ మాల్

image

భారతీయ సంస్కృతికి చిహ్నం చీర కట్టు.. HYDలో ప్రప్రథమంగా మాంగళ్య షాపింగ్ మాల్ వారు శారీ డ్రాపింగ్ ఈవెంట్ నిర్వహించారు. వనస్థలిపురంలోని షాపింగ్ మాల్‌లో చెన్నైకి చెందిన ప్రముఖ శారీ డ్రాపర్ కవిత చీర కట్టు ఎలా ఉండాలనే అంశాలను వివరించారు. ఆసక్తిగా గమనించిన ఫ్యాషన్ డిజైనర్స్, బ్యూటీ పార్లర్ నిర్వాహకులు యాజమాన్యాన్ని అభినందించారు. ఛైర్మన్ కాసం నమశ్శివాయ, డైరెక్టర్లు పాల్గొన్నారు.

News March 14, 2025

HYD: హోలీ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత: సీపీ

image

35 ఏళ్ల తర్వాత ఒకే రోజు హోలీ, రంజాన్ మాసంలో రెండవ శుక్రవారం ఒకేరోజు రావడంతో HYD సీపీ సీవీ ఆనంద్ అధికారులను అప్రమత్తం చేశారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. ప్రతీ జోన్, సున్నితమైన ప్రాంతాల్లో పికెట్‌లు ఏర్పాటు చేయాలని, అసాంఘిక శక్తులపై కట్టుదిట్టమైన నిఘా పెట్టాలని అధికారులకు ఆదేశించారు. అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్, డీసీపీ చైతన్య కుమార్ పాల్గొన్నారు.

error: Content is protected !!