News June 23, 2024

అమెరికా, దక్షిణ కొరియా నుంచి ఫణిగిరికి బౌద్ధ శిల్పాలు

image

ఫణిగిరి బౌద్ధ శిల్పాలు, జాతక కథలు తెలిపే తోరణాలను గత ఏడాది జులైలో అంతర్జాతీయ ప్రదర్శన నిమిత్తం USలోని న్యూయార్క్‌ మెట్రోపాలిటన్‌ మ్యూజియానికి, దక్షిణకొరియా సియోల్‌కి తీసుకెళ్లారు. ప్రదర్శన ముగిసిన అనంతరం శనివారం వీటిని తిరిగి ఫణిగిరి మ్యూజియంలో భద్రపర్చినట్లు ఆర్కియాలజీ AD మల్లునాయక్‌ తెలిపారు. ప్రపంచంలోని పురవస్తు శాఖ శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఫణిగిరి బౌద్ధ శిల్పాలను సందర్శించారని పేర్కొన్నారు.

Similar News

News December 15, 2025

MLG: రెండో విడతలో తగ్గిన పోలింగ్ శాతం

image

మొదటి విడతలో కంటే రెండో విడతలో స్వల్పంగా పోలింగ్ శాతం తగ్గింది. మొదటి విడతలో NLG, CDR రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 14 మండలాల్లో జరిగిన ఎన్నికల్లో 90.53 శాతం పోలింగ్ నమోదు కాగా రెండో విడతలో MLG డివిజన్ లోని 10 మండలాల్లో జరిగిన ఎన్నికల్లో 88.74 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. రెండో విడత పోలింగ్‌లో అత్యధికంగా మాడుగులపల్లి మండలంలో 92.34 శాతం పోలింగ్ నమోదు కాగా, మిర్యాలగూడలో 85.79 శాతం పోలింగ్ నమోదైంది.

News December 15, 2025

పెద్దవూర: మూడు ఓట్లతో ఇండిపెండెంట్ విజయం

image

పెద్దవూర మండలం సంగారం గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఇండిపెంటెండ్ ఈసం రమేష్ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ బలపరిచిన మాతంగి శ్రీనయ్య మీద 3 ఓట్ల తేడాతో విజయం సాధించారు. తన మీద నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామ అభివృద్ధితో పాటు గ్రామానికి సేవ చేస్తా అని అన్నారు.

News December 14, 2025

త్రిపురారం: రాష్ట్రంలోనే చిన్న పంచాయతీ.. ఎవరు గెలిచారంటే..

image

బృందావనపురం సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన మందడి రమణారెడ్డి విజయం సాధించారు. తన ప్రత్యర్థి, బీఆర్ఎస్ బలపరిచిన వంగాల శ్రీనివాస్ రెడ్డిపై ఏడు ఓట్ల తేడాతో రమణారెడ్డి విజయం సాధించారు. రమణారెడ్డి విజయం సాధించడంతో కాంగ్రెస్ శ్రేణులు, మద్దతుదారులు సంబరాలు జరుపుకుంటున్నారు. బృందావనపురం గ్రామపంచాయతీ రాష్ట్రంలోనే అతి చిన్న గ్రామపంచాయతీ కావడం విశేషం. ఇక్కడ కేవలం 98 ఓట్లు మాత్రమే ఉన్నాయి.