News March 9, 2025

అమెరికా నుంచి వచ్చి.. విశాఖలో మృతి

image

అమెరికాలో స్థిరపడ్డ రోజా అనే వివాహిత విశాఖలో విగతజీవిగా మారింది. అమెరికాలో వైద్యునిగా పనిచేస్తున్న విశాఖకు చెందిన శ్రీధర్‌కు రోజాతో పరిచయం ఏర్పడింది. శ్రీధర్ నెల రోజుల క్రితం విశాఖ రాగా.. నాలుగు రోజుల క్రితం రోజా కూడా చేరుకుంది. వీరిద్దరూ హోటల్లో ఉండగా ఆమె మృతి చెందినట్లు త్రీటౌన్ పోలీసులకు శ్రీధర్ ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Similar News

News September 19, 2025

విశాఖ: గోల్డ్ డిపాజిట్ పేరుతో మోసం.. ముగ్గురి అరెస్టు

image

వన్ టౌన్‌లో నివాసం ఉంటున్న నవీన్ కుమార్ దంపతులను గోల్డ్ డిపాజిట్ పేరుతో మోసం చేసిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు సీఐ జీడి బాబు తెలిపారు. బాధితులకు గోల్డ్ ఇస్తామని రూ.3 కోట్లు తీసుకొని ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పారు. నిందితులు దామోదర నాయుడు, ఉమామహేశ్వరరావు, దిలీప్‌లను రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఎవరైనా బాధితులు ఉంటే నేరుగా వన్ టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేయాలన్నారు.

News September 18, 2025

విశాఖలో 524 ఆక్రమణల తొలగింపు

image

విశాఖలో ఆపరేషన్ లంగ్స్‌లో భాగంగా 524 ఆక్రమణల తొలగించారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు ఆపరేషన్ లంగ్స్ చేపట్టినట్లు చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకర రావు గురువారం తెలిపారు. జోన్ 1లో 20 ఆక్రమణలు, జోన్-2 90, జోన్ -3లో 42, జోన్ -4 60, జోన్ -5లో 52, జోన్-6లో 86, జోన్ – 7లో 42, జోన్-8లో 67 ఆక్రమణలు తొలగించారు.

News September 18, 2025

ఈ-గవర్నెన్స్ సదస్సుకు అన్ని ఏర్పాట్లు చేయాలి – కలెక్టర్

image

విశాఖలో సెప్టెంబ‌ర్ 22, 23న జరిగే 28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సుకు పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గురువారం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడారు. నోవాటెల్ హోటల్‌లో జరిగే ఈ సదస్సులో ఐటీ నిపుణులు, కేంద్ర-రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారని తెలిపారు. 13 ప్రధాన, 10 ఉప కమిటీల సమన్వయంతో నగర సుందరీకరణ, భద్రత, శానిటేషన్ తదితర చర్యలు చేపట్టాలని సూచించారు.