News March 9, 2025

అమెరికా నుంచి వచ్చి.. విశాఖలో మృతి

image

అమెరికాలో స్థిరపడ్డ రోజా అనే వివాహిత విశాఖలో విగతజీవిగా మారింది. అమెరికాలో వైద్యునిగా పనిచేస్తున్న విశాఖకు చెందిన శ్రీధర్‌కు రోజాతో పరిచయం ఏర్పడింది. శ్రీధర్ నెల రోజుల క్రితం విశాఖ రాగా.. నాలుగు రోజుల క్రితం రోజా కూడా చేరుకుంది. వీరిద్దరూ హోటల్లో ఉండగా ఆమె మృతి చెందినట్లు త్రీటౌన్ పోలీసులకు శ్రీధర్ ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Similar News

News March 20, 2025

దొంగగా మారిన బ్యాంకు ఉద్యోగి

image

విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో బ్యాంకు చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు కాకినాడ ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. అతని నుంచి 2 గన్లు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కాజులూరులో దొంగతనం కేసులో అతనిని అరెస్టు చేయగా పలు విషయాలు బయటపడ్డాయి. నాగేశ్వరరావు గతంలో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్‌లో పనిచేస్తూ 900 గ్రాముల బంగారం అవకతవకలు చేయడంతో తొలగించినట్లు తెలిపారు.

News March 20, 2025

విశాఖ నుంచి వెళ్లే రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లు రద్దు

image

సామర్లకోట-రావికంపాడు మధ్యన ఆటో మేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థకు సంబంధించి నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా సింహాద్రి, ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల 23,24 తేదీల్లో గుంటూరు – విశాఖ సింహాద్రి ఎక్స్‌ప్రెస్ అదే విధంగా విశాఖ – గుంటూరు సింహాద్రి, 24న ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌ను రెండు వైపులా రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

News March 20, 2025

సంచిలో ట్రాన్స్‌జెండర్ తల, చేయి లభ్యం

image

అనకాపల్లి జిల్లాలో ట్రాన్స్‌జెండర్ హత్య కలకలం రేపింది. కశింకోట మండలం బయ్యవరంలో హంతకుడు ఆమె నడుము కింది భాగం, కాలు, చేయి మూట కట్టి పడేశాడు. దీంతో జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ వకుల్ జిందాల్ 8 టీమ్‌లతో దర్యాప్తు చేపట్టి చనిపోయింది దీపుగా గుర్తించారు. అయితే ఆమె తల, మరో చేయి అనకాపల్లి వై జంక్షన్ వద్ద సంచిలో దొరికాయి.

error: Content is protected !!