News April 27, 2024

అమెరికా యూనివర్సిటీ ఎన్నికల్లో అద్దంకి వాసి

image

అమెరికాలో యూనివర్సిటికీ సంబంధించిన ఇండియన్ స్టూడెంట్స్ అసోసియేషన్‌కు జరిగిన ఎన్నికలలో ఏపీకి చెందిన రోహిత్ శ్రీసాయి బాచిన అధ్యక్షుడిగా ఘన విజయం సాధించారు. వీరి స్వగ్రామం అద్దంకి నియోజకవర్గం జె. పంగులూరు గ్రామం. వీరి తండ్రి బాచిన హనుమంత రావు కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా ఏపీ హైకోర్టులో విధులు నిర్వహిస్తున్నారు.

Similar News

News November 2, 2024

ప్రకాశం: రైలు కిందపడి వ్యక్తి మృతి

image

తర్లుపాడు మండలంలోని సూరెపల్లి రైల్వే గేట్ సమీపంలో శనివారం రైలు కింద పడి వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలిస్తున్నారు. మృతుడు ఆత్మహత్య చేసుకున్నాడా లేదా ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడ్డాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News November 2, 2024

ప్రకాశం: ‘పల్లె పండుగ పనులు పూర్తి కావాలి’

image

ప్రకాశం జిల్లాలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా చేపట్టే సి.సి రోడ్లు, సైడ్ డ్రెయిన్ పనులు డిసెంబర్‌ లోగా పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ అధికారులతో సమావేశమై, పల్లె పండుగ కార్యక్రమంలో మంజురైన 1140 కొత్త పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో కలెక్టర్ తమీమ్ అన్సారియాతో పాటు, డ్వామా, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు కూడా ఉన్నారు.

News November 2, 2024

ప్రకాశం: వైసీపీకి షాక్‌లు.. మీ కామెంట్?

image

ప్రకాశం జిల్లాలో వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీని వీడిన విషయం తెలిసిందే. ఒంగోలు మేయర్ సైతం టీడీపీ గూటికి చేరారు. తాజాగా వైసీపీకి పెద్దగా ఉన్న మరో సీనియర్ నేత కరణం బలరామ్ తన కుమారుడు వెంకటేశ్‌తో కలిసి ఆ పార్టీని వీడుతారని తెలుస్తోంది. ఇలా ఒక్కొక్కరు వైసీపీని వీడటంపై మీ కామెంట్ ఏంటి?