News April 24, 2025

అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది: MLC కవిత

image

గోదావరిఖనిలో రేణుకా ఎల్లమ్మ కళ్యాణోత్సవ వేడుకలు బుధవారం కన్నుల పండుగగా జరిగింది. ఈ వేడుకల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా MLC కల్వకుంట్ల కవిత ప్రత్యేకంగా హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ‘శ్రీ రేణుకా ఎల్లమ్మ కళ్యాణ వేడుకల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది. శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆశీస్సులతో ప్రజలందరికీ శుభం కలగాలని’ ఆమె ఆకాంక్షించారు.

Similar News

News April 24, 2025

నూజివీడు: ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ

image

రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ త్రిపుల్ ఐటీల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల అయ్యింది . దీనిలో భాగంగా నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం త్రిపుల్ ఐటీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి గానూ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్ గురువారం తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈనెల 27 నుంచి మే 20వ తేదీలోపు ఆర్జీయూకేటీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

News April 24, 2025

తెనాలి: బాలికపై లైంగిక దాడి.. కేసు నమోదు

image

తెనాలిలో ఏడవ తరగతి చదువుతున్న బాలికపై NTR (D) మైలవరానికి చెందిన అవినాశ్ లైంగిక దాడికి పాల్పడగా వన్ టౌన్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఓ ప్రైవేటు స్కూల్లో 7వ తరగతి చదువుతున్న బాలికకు అవినాశ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయ్యాడు. ఇటీవల తెనాలి వచ్చిన అతడు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లిదండ్రులు విచారించగా వెలుగులోకి రావడంతో ఫిర్యాదు చేశారు.

News April 24, 2025

చంద్రుడిపై చైనా, రష్యా అణు విద్యుత్ కేంద్రం!

image

చంద్రుడిపై అంతర్జాతీయ అణు విద్యుత్ కేంద్రాన్ని(ILRS) సంయుక్తంగా ప్రారంభించాలని చైనా, రష్యా ప్రణాళిక రచిస్తున్నాయి. ‘2028 కల్లా చంద్రుడిపై స్థావరానికి ఏర్పాట్లు మొదలుపెట్టాలని భావిస్తున్నాం. దానికి విద్యుత్‌ అందించేందుకు అణువిద్యుత్ కేంద్రం అవసరం. రోదసి ప్రయోగాల్లో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న రష్యాతో కలిసి దాని నిర్మాణం కోసం పనిచేయాలని భావిస్తున్నాం’ అని చైనా పరిశోధకులు తెలిపారు.

error: Content is protected !!