News August 25, 2024

అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలి: మాజీ మంత్రి

image

సూర్యపేటలోని తాళ్లగడ్డలో కొలువుదీరిన శ్రీ ఇంద్రవెళ్లి ముత్యాలమ్మ తల్లి బోనాల పండుగ సందర్బంగా అమ్మవారిని మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలకు ఆయురారోగ్యాలతో పాటు అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించి పాడి పంటలతో తులతూగాలని చల్లని ఆశీస్సులు అందజేయాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.

Similar News

News January 23, 2026

NLG: నల్గొండలో త్రిముఖ పోటీ

image

నల్గొండ కార్పొరేషన్‌కు జరగనున్న ఎన్నికల్లో త్రిముఖ పోటీకి రంగం సిద్ధం అవుతోంది. షెడ్యూల్ వచ్చేలోగా అధికారికంగా అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసి ప్రచారంలో దిగేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నారు. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్, సీపీఎంతో జతకలిసి ఈ ఎన్నికల్లో తలపడనున్నది. బీజేపీ సైతం నల్గొండ కార్పొరేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే అభ్యర్థిత్వాల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది.

News January 23, 2026

గురుకుల ప్రవేశాల గడువు 25 వరకు పొడిగింపు

image

తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 9వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా బీసీ గురుకులాల ఆర్సీఓ స్వప్న తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఫిబ్రవరి 22న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

News January 23, 2026

నల్గొండ మీదుగా ‘అమృత్‌ భారత్‌’ రైలు

image

నల్గొండ మీదుగా మరో అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ అందుబాటులోకి రానుంది. HYD చర్లపల్లి నుంచి కేరళలోని తిరువనంతపురానికి నల్గొండ, మిర్యాలగూడ స్టేషన్ల మీదుగా ఈ రైలు వెళ్లనుంది. వారంతపు సర్వీసుగా నడిచే ఈ రైలులో 11జనరల్‌, 8స్లీపర్‌ కోచ్‌లతో పాటు దివ్యాంగుల కోసం రెండు ప్రత్యేక బోగీలు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. తక్కువ ఛార్జీతో దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ రైలు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది.