News April 2, 2025

అమ్మాయిపై గ్యాంగ్ రేప్.. నాగర్‌కర్నూల్‌లో ఆందోళన  

image

ఊర్కొండపేటలో జరిగిన అత్యాచార ఘటనలో నిందితులను చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నాగర్‌కర్నూల్‌లోని అంబేడ్కర్ విగ్రహం దగ్గర సీపీఎం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కార్యదర్శి వర్ధం పర్వతాలు మాట్లాడుతూ..అక్కడ ఒక గ్యాంగ్ మాటు వేసుకుని ఉందంటే ఈ తతంగం ఇప్పటికిప్పుడు జరిగిందేమీ కాదని, కొంతమంది సహకారం లేకపోతే ఇలాంటి క్రూర, దుర్మార్గమైన ఘటనలు జరగవన్నారు.

Similar News

News November 6, 2025

వరల్డ్ క్లాస్ బ్యాంకుల కోసం చర్చలు: నిర్మల

image

భారత్‌కు అతిపెద్ద, వరల్డ్ క్లాస్ బ్యాంకుల అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆ దిశగా ప్రభుత్వం ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టిందన్నారు. ఆర్బీఐతోపాటు బ్యాంకులతోనూ చర్చిస్తున్నామని ముంబైలో జరిగిన 12th SBI బ్యాంకింగ్&ఎకనామిక్స్ కాంక్లేవ్‌లో తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధానంగా దృష్టిసారించామని, పదేళ్లలో మూలధన వ్యయం 5 రెట్లు పెరిగిందని పేర్కొన్నారు.

News November 6, 2025

ఖచ్చితత్వంతో ఓటర్ల జాబితా రూపొందిస్తున్నాం: కలెక్టర్

image

జిల్లాలో ఖచ్చితత్వంతో కూడిన ఓటర్ల జాబితా రూపొందిస్తున్నామని కలెక్టర్ వెట్రిసెల్వి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్‌కి వివరించారు. ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం నుండి నిర్వహించిన వీసీ‌లో కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పాల్గొన్నారు. రాజకీయ పక్షాల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటుచేసి, సూచనలు, ఫిర్యాదులను తీసుకుంటున్నామని కలెక్టర్ అన్నారు.

News November 6, 2025

సింగరేణి అధికారులకు సీఎండీ సూచనలు

image

మైనింగ్ తో పాటు అన్ని శాఖల అధికారులు బాగా పనిచేయాలని సింగరేణి సంస్థ సీఎండీ బలరాం తెలిపారు. ఏ ఒక్క పని పెండింగ్లో ఉండకూడదని, పనితీరులో అలసత్వాన్ని సహించేది లేదన్నారు. గురువారం అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో ప్రత్యేక సమీక్షలో సూచనలు చేశారు. వివిధ కార్పోరేట్ విభాగాల జనరల్ మేనేజర్లు ప్రత్యక్షంగానూ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.