News August 3, 2024

అమ్మో టెక్కలా.. ఉద్యోగుల్లో ఆందోళన

image

టెక్కలి డివిజన్ కేంద్రం పేరు చెబితే ఉద్యోగులు ఆసక్తి చూపడం లేదు. పని చేసిన చోట పోస్టింగ్ అంటే చాలా మంది రావడం లేదు. రెవెన్యూ, పోలీసు ఇతర శాఖల అధికారులు సైతం టెక్కలి వచ్చేందుకు నిరాసక్తత చూపుతున్నారు. గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, అవి మంత్రి అచ్చెన్నాయుడు వెలికితీస్తారని భయపడుతునట్లు టాక్ నడుస్తోంది. టెక్కలి సబ్ కలెక్టర్, డీఎస్పీ స్థానాల విషయంలోను ఎలాంటి స్పష్టత రాలేదు.

Similar News

News September 19, 2024

దాసన్నకే మళ్లీ వైసీపీ పగ్గాలు

image

వైసీపీ జిల్లా అధ్యక్షునిగా Ex.Dy.CM ధర్మాన కృష్ణదాస్‌ని వైసీపీ అధినేత జగన్ గురువారం నియమించారు. దాసన్న కుటుంబం మొదట్నుంచీ వైఎస్ కుటుంబానికి అత్యంత ఆత్మీయులు, ఆప్తులుగా పేరుపొందారు. పార్టీ ఆవిర్భావం నుంచీ దాసన్న సతీమణి పద్మప్రియ జిల్లా
అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం ధర్మాన గత ప్రభుత్వంలో మంత్రిమండలి నుంచి మళ్లీ పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు మళ్లీ ఆయనకే పట్టంకట్టారు.

News September 19, 2024

కవిటి: చంద్రబాబు రాక ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న కలెక్టర్

image

కవిటి మండలం రాజాపురానికి శుక్రవారం సీఎం రానున్నారు. రాజపురంలో జరిగే ‘ఇది మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శ్రీకాకుళం జిల్లాకు తొలిసారిగా సీఎం వస్తుండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎమ్మెల్యే అశోక్ బాబు, డీఎస్పీ మహేందర్ రెడ్డి గురువారం రాజాపురానికి చేరుకుని.. ఏర్పాట్లను పరిశీలించారు.

News September 19, 2024

శ్రీకాకుళం: 100 రోజుల TDP పాలనపై మీ కామెంట్?

image

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 స్థానాలు గెలిచి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు రేపటితో 100 రోజుల పాలన పూర్తి చేసుకోనుంది. ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని రేపటి నుంచి ఈనెల 26 వరకు ఎమ్మెల్యేలు ప్రజలకు వివరించనున్నారు. పింఛన్ పెంపు, అన్న క్యాంటీన్లు, ఫ్రీ ఇసుక వంటి హామీలను అమలు చేశామని కూటమి చెబుతుండగా, పాలన అట్టర్ ఫ్లాప్ అని వైసీపీ విమర్శిస్తోంది. 100 రోజుల పాలన, మీ ఎమ్మెల్యే పనితీరుపై మీ కామెంట్..