News May 26, 2024
అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు బాధ్యతలు ఇలా..

ప్రభుత్వం 2024-25 విద్యా సంవత్సరం విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఆదర్శ పాఠశాలల కమిటీలను ఏర్పాటు చేసింది. కమిటీల బాధ్యతలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
* ప్రాథమిక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం
* తాగునీటి సౌకర్యాలు కల్పించడం
* పాఠశాల ప్రాంగణంలో పారిశుధ్యం&నిర్వహణ
* విద్యార్థులకు యూనిఫామ్స్ కుట్టడం
* బాలికల మరుగుదొడ్ల నిర్మాణం
* పాఠశాలలో సోలార్ ఫ్యానల్స్ ఏర్పాటు
Similar News
News March 6, 2026
MBNR: ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక విజయవంతం చేయాలి

ప్రజా పాలని -ప్రగతి ప్రణాళిక విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజానర్సింహా పిలుపునిిచ్చారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఐడీఓసీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చి 6 తారీకు నుంచి జూన్ 12 వరకు ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. 99 రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తదితరులు పాల్గొన్నారు.
News March 6, 2026
MBNR: యుద్ధం ఎఫెక్ట్.. పడిపోయిన కోడిగుడ్ల ధరలు!

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కోడిగుడ్ల ధరలు రోజురోజుకు పడిపోతున్నాయి. NECC ఒక్క గుడ్డు ధర 4.30 ఉన్నప్పటికీ.. డిమాండ్ లేకపోవడంతో.. గుడ్డు ధర రూ.3.50 మాత్రమే పలుకుతోంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతుండడంతో కోడిగుడ్ల ఎగుమతి లేదని పౌల్ట్రీ ఫారం యజమానులు అన్నారు. యుద్ధం వల్ల ఎగుమతి లేకపోవడంతో నిల్వలు పెరిగాయన్నారు. యుద్ధం ఇలాగే కొనసాగితే పౌల్ట్రీ ఫారం రైతులు తీవ్రంగా నష్టపోతామన్నారు.
News March 6, 2026
MBNR: అధిక ఎండలు.. ప్రజల బెంబేలు

మహబూబ్ నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో.. చిన్న చింతకుంట మండలం నంది వడ్డేమాన్‌లో, కోయిలకొండ మండలం పారుపల్లిలో 38.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. భూత్పూర్ 38.4, చిన్న చింతకుంట 38.1, అడ్డాకుల 38.0, మిడ్జిల్ మండలం కొత్తపల్లి, భూత్పూర్ మండలం కొత్త మొల్గర 37.9, కౌకుంట్ల, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్, మూసాపేట మండలం జానంపేట 37.8, దేవరకద్ర 37.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.


