News July 21, 2024

అమ్మ బత్తాయో..! నిండా మునిగిన రైతులు

image

నల్లగొండ జిల్లాలో 68 మంది బత్తాయి రైతులు నిండా మునిగారు. తిరుపతి ఉద్యాన యూనివర్సిటీ నుంచి 11 ఏళ్ల క్రితం బత్తాయి మొక్కలు తీసుకువచ్చి జిల్లాలో నాటిన రైతులు దిగుబడి రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. సుమారు 350 ఎకరాల్లో ఈ బత్తాయి మొక్కలు నాటారు. సాధారణంగా నాలుగో ఏటా నుంచి దిగుబడి ప్రారంభమవుతుందని 8 ఏళ్లు గడిచినా సాధారణ దిగుబడి కూడా రాలేదని రైతులు తెలిపారు.

Similar News

News December 11, 2025

నల్గొండ: దరఖాస్తులకు మూడు రోజులే గడువు

image

జిల్లాలోని 14 పాఠశాలల్లో బాలికలకు కరాటే నేర్పించడానికి ఆసక్తి, కరాటే బ్లాక్ బెల్ట్ కలిగిన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి మహ్మద్ అక్బర్ అలీ తెలిపారు. కరాటే బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్లు, పూర్తి బయోడేటాతో ఈనెల 15లోగా నగొండలోని యువజన, క్రీడల శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఎంపికైన వారికి నెలకు రూ.5 వేల చొప్పున పారితోషికం ఇస్తామన్నారు.

News December 11, 2025

నల్గొండ: డిగ్రీ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల

image

డా.బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (BA, B.Com, Bsc) I, III, V సెమిస్టర్ల ఫీజును డిసెంబర్ 27 తేదీ లోపు చెల్లించాలని ఓపెన్ యూనివర్సిటీ రీజినల్ కో ఆర్డినేటర్ డాక్టర్ బొజ్జ అనిల్ కుమార్ తెలిపారు. Bsc విద్యార్థులు, BCom కంప్యూటర్స్ విద్యార్థులు థియరీ పరీక్షలతో పాటు ప్రాక్టికల్స్‌కు రిజిస్ట్రేషన్ చేయించి ఫీజు చెల్లించాలన్నారు. వివరాల కోసం విద్యార్థులు స్టడీ సెంటర్లలో సంప్రదించాలన్నారు.

News December 11, 2025

నల్గొండ జిల్లాలో ప్రారంభమైన పోలింగ్

image

నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. చిట్యాల మండలంలో 18 జీపీల్లో మొదటి దశ పోలింగ్ ప్రారంభమైంది. ఉ.గం. 7 గంటల నుంచి మ.1 వరకు ఎన్నికలు జరగనుండగా మొదటి గంటలో అంతగా ఓటర్లు పోలింగ్ కేంద్రానికి చేరుకోలేదు. మండలంలోని 180 పోలింగ్ కేంద్రాల్లో 35,735 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సర్పంచ్ అభ్యర్థులుగా 56 మంది పోటీలో ఉన్నారు.