News February 26, 2025

అమ్రాబాద్‌లో సోషల్ ఆడిట్.. రూ.79,402 రికవరీ

image

అమ్రాబాద్ మండలంలో మంగళవారం 14వ రౌండ్ సోషల్ ఆడిట్ నిర్వహించారు. DRDO అదనపు అధికారి రాజేశ్వరి తెలిపిన వివరాల ప్రకారం 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు ఆడిట్ నిర్వహించగా, 20 గ్రామ పంచాయతీల్లో మొత్తం రూ.79,402 రికవరీ చేశారు. ఇందులో రూ. 75,402 రికవరీ, రూ. 4,000 పెనాల్టీగా ఉంది. ఈ కార్యక్రమంలో SIM అజీమ్, విజిలెన్స్ నజీర్ రాజు, APO శ్రీనివాసులు, AO జంగయ్య, TA, PS తదితరులు పాల్గొన్నారు.

Similar News

News December 7, 2025

‘బాబ్రీ’ పేరుతో రాజకీయాలు వద్దు: కాంగ్రెస్ MP

image

టీఎంసీ బహిష్కృత నేత, MLA హుమాయున్ కబీర్‌పై బెంగాల్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ డిమాండ్ చేశారు. బాబ్రీ తరహా మసీదు నిర్మాణం పేరుతో దేశంలో విద్వేషపూరిత వాతావరణం సృష్టించడమే టార్గెట్‌గా కామెంట్లు చేశారని మండిపడ్డారు. మసీదు నిర్మించుకోవచ్చని, దాని పేరుతో రాజకీయాలు చేయొద్దన్నారు. ఈ వివాదం వెనుక బీజేపీ ఉందని ఆరోపించారు. 2019 ఎన్నికల్లో బీజేపీ తరఫున కబీర్ పోటీ చేశారన్నారు.

News December 7, 2025

వైట్ హెడ్స్‌ని ఇలా వదిలిద్దాం..

image

శీతాకాలంలో ఎదురయ్యే చర్మ సమస్యల్లో వైట్ హెడ్స్ ఒకటి. వీటిని తగ్గించడానికి కొన్ని ఇంటి చిట్కాలు..* వేపాకులు, పసుపు పేస్ట్ చేసి దాన్ని వైట్ హెడ్స్‌పై రాసి పావుగంట తర్వాత కడిగేస్తే చాలు. * సెనగపిండి, పెసర పిండి, పాలు, కాస్త నిమ్మరసం కలిపి పేస్ట్ చేసి 20నిమిషాల పాటు ముఖానికి ఉంచి కడిగేయాలి. * వంటసోడాలో నీళ్లు కలిపి ఈ మిశ్రమాన్ని వైట్‌హెడ్స్‌పై రాయాలి. కాసేపటి తర్వాత నీళ్లతో కడిగేయాలి.

News December 7, 2025

రేపు నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి విడుదల

image

నిజాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి ప్రధాన కాలువకు, దిగువకు సోమవారం ఉదయం యాసంగి సాగుకు నీటిని విడుదల చేయనున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. అధిక ప్రవాహం వల్ల కాలువలోకి పశువులు, గొర్రెలు వెళ్లకుండా కాపరులు, రైతులు అప్రమత్తంగా ఉండాల సూచించారు. వివిధ గ్రామాల ప్రజలను అప్రమత్తం ఉండే విధంగా గ్రామస్థాయి అధికారులకు సూచించారు.