News October 5, 2024
అమ్రాబాద్: గద్దర్ విగ్రహావిష్కరణ సభను విజయవంతం చేయాలి

అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామంలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించే గద్దర్ విగ్రహావిష్కరణ సభను విజయవంతం చేయాలని బల్మూర్ మండల అంబేడ్కర్ యువజన సంఘం నాయకుడేు గోరటి అశోక్ కోరారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, ప్రధానవక్తలుగా కంచ ఐలయ్య, ఏపూరి సోమన్న, గద్దర్ కూతురు వెన్నెల రానున్నారని ప్రజా సంఘాల నాయకులు, యువజన సంఘాల నాయకులు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు.
Similar News
News March 17, 2026
MBNR: ఎస్సీ యువతకు భారీ సబ్సిడీ రుణాలు

నిరుద్యోగ ఎస్సీ యువత స్వయం ఉపాధి కోసం రూ. 1 నుంచి రూ.7 లక్షల వరకు రుణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సునీత తెలిపారు. దీనిపై 50% నుంచి 90% వరకు సబ్సిడీ ఉంటుంది. 21-50 ఏళ్ల మధ్య వయస్సు వారు మార్చి 24లోపు TGOBMMS పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు 98499 05996ను సంప్రదించవచ్చు.
News March 17, 2026
మహమ్మదాబాద్‌లో అత్యధిక వర్షపాతం నమోదు

మహబూబ్‌నగర్ జిల్లాలో సోమవారం రాత్రి వివిధ ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అత్యధికంగా మహమ్మదాబాద్‌లో 10.3 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. హన్వాడ 7.0, నవాబుపేట 6.5, గండీడ్ మండలం సల్కర్ పేట 4.5, మిడ్జిల్ మండలం దోనూరు 2.3, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 1.5, బాలానగర్ 1.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. వర్షం కురిసిన ప్రాంతంలో వాతావరణ ఒక్కసారిగా చల్లబడింది.
News March 17, 2026
పాలమూరు: రంజాన్ వేళ ఘుమఘుమలు..!

పవిత్ర రంజాన్ నెల వచ్చిందంటే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో హలీమ్.. నోరూరించే చికెన్ హరీస్ దర్శనమిస్తాయి. ముస్లింలతో పాటు ఇతర వర్గాల వారు కూడా ఇష్టంగా కొనుక్కుని తింటారు. ప్రధాన రహదారుల్లో, పెద్ద హోటళ్ల ముందు నిర్వాహకులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. పలుచోట్ల సాయంత్రం వేళల్లో భోజన ప్రియులు క్యూలు కట్టి మరీ తింటున్నారు. మీరు తిన్నారా? కామెంట్ చేయండి?


