News February 15, 2025
అమ్రాబాద్: నల్లమల అటవీ ప్రాంతంలో పులి సంచారం

అమ్రాబాద్ మండలంలోని నల్లమల ఫరహాబాద్ చౌరస్తాలో శుక్రవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఎకో-టూరిజం ప్యాకేజీ సందర్శకులు గుండం సఫారీ రోడ్డులో నేరుగా పులిని చూశారు. ఈ అద్భుత దృశ్యాన్ని చూసి సందర్శకులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. అటవీ శాఖ అధికారులు పులిని ఆడపులి గుర్తించారు. ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకుల కోసం ప్రత్యేక అనుభవంగా మారాయి. అటవీ ప్రాంతంలో పులిని చూడటం పర్యాటకుల ఆసక్తిని పెంచుతోంది.
Similar News
News October 22, 2025
జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్, సునీత నామినేషన్లకు ఆమోదం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక స్క్రూటినీ వేళ రిటర్నింగ్ ఆఫీస్ వద్ద కోలాహలం నెలకొంది. అభ్యర్థులు పోటీలో ఉంటారా? లేదా? అనే వెరిఫికేషన్ ఆసక్తిని పెంచింది. అభ్యర్థులు అయితే కాస్త టెన్షన్ పడ్డారు. సునీత నామినేషన్ రద్దు చేయాలని, నవీన్ యాదవ్ నామినేషన్ రద్దు చేయాలని SMలో ఇరు పార్టీల నేతలు పోస్టులు పెట్టారు. కానీ, పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన రిటర్నింగ్ అధికారులు నవీన్ యాదవ్, సునీత నామినేషన్లకు ఆమోదం తెలిపారు.
News October 22, 2025
రానున్న 5 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు!

AP: నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వల్ల రేపు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. రానున్న 5 రోజులు రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంబడి 35-55km/h వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. శనివారం వరకు జాలర్లు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
News October 22, 2025
మేడారంలో 1050 ఎకరాల్లో 49 పార్కింగ్ స్థలాలు

మేడారం మహా జాతర సమయంలో లక్షల సంఖ్యలో తరలి వచ్చే భక్తులు వాహనాలను నిలిపేందుకు అధికార యంత్రాంగం భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. హైదరాబాద్లో బుధవారం జరిగిన మేడారం జాతర సమీక్షలో కలెక్టర్ దివాకర వివరాలను వెల్లడించారు. 1050 ఎకరాల్లో 49 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వీటిలో 4.5లక్షల నుంచి 6లక్షల వాహనాలు ఏకకాలంలో నిలిపే అవకాశం ఉందన్నారు. 33 అటవీ మార్గాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు.


