News February 15, 2025
అమ్రాబాద్: నల్లమల అటవీ ప్రాంతంలో పులి సంచారం

అమ్రాబాద్ మండలంలోని నల్లమల ఫరహాబాద్ చౌరస్తాలో శుక్రవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఎకో-టూరిజం ప్యాకేజీ సందర్శకులు గుండం సఫారీ రోడ్డులో నేరుగా పులిని చూశారు. ఈ అద్భుత దృశ్యాన్ని చూసి సందర్శకులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. అటవీ శాఖ అధికారులు పులిని ఆడపులి గుర్తించారు. ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకుల కోసం ప్రత్యేక అనుభవంగా మారాయి. అటవీ ప్రాంతంలో పులిని చూడటం పర్యాటకుల ఆసక్తిని పెంచుతోంది.
Similar News
News March 17, 2025
టెన్త్ విద్యార్థులకు ఫ్రీ బస్

నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానుండటంతో విశాఖ జిల్లాలోని విద్యార్థులందరినీ బస్సుల్లో ఉచితంగా పరీక్షా కేంద్రాలకు చేరుస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. మొత్తం 7 డిపోల నుంచి 150 బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా సమయానికి ముందు, ముగిసిన తర్వాత 2.30 గంటల వరకు బస్సులు షెడ్యూల్, స్పెషల్ బస్సులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. హాల్ టికెట్లు చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పారు.
News March 17, 2025
ఏలూరు : బాలికపై అత్యాచారం .. కేసు

ఏలూరు రూరల్ ప్రాంతానికి చెందిన పౌలు (20) అనే ఆటో డ్రైవర్‌పై రూరల్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైంది. 15 ఏళ్ల బాలికకు ప్రేమించానని మాయమాటలు చెప్పి, ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు ఆదివారం రాత్రి ఏలూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News March 17, 2025
ఖమ్మం పాత బస్టాండ్‌లో సౌకర్యాలు నిల్..!

ఖమ్మం పాత బస్టాండ్‌లో సౌకర్యాలు అధ్వానంగా ఉన్నాయని ప్రయాణికులు వాపోయారు. కనీసం కూర్చోవడానికి కుర్చీలు, ప్యాన్లు లేవన్నారు. మూత్రశాలలు సైతం కంపుకోడుతున్నాయని చెబుతున్నారు. బస్టాండ్ అవరణలో ఉన్న షాపుల వారు ఉన్న రేట్లకంటే అధికంగా వసూళ్లు చేస్తున్నారన్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలంటున్నారు.