News April 2, 2025
అమ్రాబాద్: నేడు ఎస్ఎల్బీసీకి మంత్రి పొంగులేటి రాక

అమ్రాబాద్ మండలం దోమల పెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకొని ప్రాణాలు వదిలిన వారి ఆచూకీ కోసం 38 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 24 గంటల పాటు మూడు షిప్టుల్లో 600 మంది రెస్క్యూ బృందాలు శ్రమిస్తూనే ఉన్నాయి. ఈ చర్యలను పరిశీలించేందుకు తెలంగాణ గృహ నిర్మాణ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం రానున్నారు.
Similar News
News November 13, 2025
మక్తల్లో డిగ్రీ ఎగ్జామ్ సెంటర్ ఏర్పాటుకు గ్రీన్సిగ్నల్

మక్తల్లో డిగ్రీ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి చొరవతో పాలమూరు యూనివర్సిటీ అనుమతి ఇచ్చింది. దీంతో మక్తల్, కృష్ణ, మాగనూరు, నర్వ, ఉట్కూరు ప్రాంతాల విద్యార్థులు ఇకపై నారాయణపేట వెళ్లే ఇబ్బంది తప్పింది. త్వరలో డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనం కూడా సిద్ధమవుతుందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.
News November 13, 2025
తిరుమల: ఘంటా మండపం విశిష్టత ఏంటంటే..?

తిరుమల సోపాన మార్గంలోని అవ్వాచారి కోనకు దగ్గరగా ఉండే ఘంటా మండపం శ్రీవారి నైవేద్య సమయాన్ని సూచిస్తుంది. 1630 ప్రాంతంలో వెంకటగిరి రాజు రఘునాథ యాచమ నాయకులు ఈ ఘంటను చంద్రగిరి రాజు రామదేవరాయలకు బహూకరించారు. తిరుమలలో స్వామివారికి నైవేద్యం పెట్టేటప్పుడు మోగే గంటల ధ్వని ఈ మండపంలోని గంటలను తాకగానే, అవి మోగేవి. ఈ శబ్దం వినిపించాకే చంద్రగిరిలోని రాజు భోజనం చేసేవారని ప్రతీతి. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 13, 2025
ఫ్రీ బస్సు.. ఆర్టీసీకి రూ.400 కోట్ల చెల్లింపు

AP: స్త్రీ శక్తి (మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం) పథకానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. స్కీమ్ ప్రారంభించిన ఆగస్టు 15 నుంచి అక్టోబర్ వరకు ఫ్రీ టికెట్లకు అయిన ఖర్చు రూ.400 కోట్లను ఆర్టీసీకి చెల్లించింది. దీనిపై కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. అయితే ప్రస్తుతం ఉన్న బస్సులు సరిపోవడం లేదని పేర్కొన్నాయి. కనీసం 3,000 కొత్త బస్సులు కొనుగోలు చేసి, 10వేల మంది సిబ్బందిని నియమించాలని కోరాయి.


