News February 5, 2025
అమ్రాబాద్: పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

అమ్రాబాద్ మండలం బికే లక్ష్మాపూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి పాఠశాల విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పరీక్షించారు. పాఠశాలలో మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉన్నారని, ప్రతిరోజు ఎంత మంది విద్యార్థులు పాఠశాలకు హాజరవుతున్నారని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, ప్రభుత్వం మెనూ ప్రకారం భోజనం అందించాలని అన్నారు.
Similar News
News October 16, 2025
ASF: ఆర్థిక స్థోమత లేని ఖైదీలకు ఉచిత న్యాయ సేవలు

ఆర్థిక స్థోమత లేని ఖైదీలకు ఉచిత న్యాయ సేవలు అందిస్తామని ASF జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేష్ అన్నారు. బుధవారం జన్కాపూర్ సబ్ జైలు అధికారులతో సమావేశం నిర్వహించారు. జైలులో ఖైదీలకు కల్పిస్తున్న సౌకర్యాలు, వారి ఆరోగ్య వివరాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఖైదీల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.
News October 16, 2025
సంగారెడ్డి: 23 వరకు ఓపెన్ స్కూల్ అడ్మిషన్ గడువు పెంపు

ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్ అడ్మిషన్ గడువు ఈనెల 23వ తేదీ వరకు పెంచినట్లు ఉమ్మడి జిల్లా సమన్వయకర్త వెంకటస్వామి బుధవారం తెలిపారు. సమీపంలోని అధ్యయన కేంద్రాలు అడ్మిషన్ కోసం సంప్రదించాలని పేర్కొన్నారు. అడ్మిషన్ రుసుం మీసేవ కేంద్రాల్లో మాత్రమే చెల్లించాలని చెప్పారు. గడువు పెంపును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News October 16, 2025
అక్టోబర్ 16: చరిత్రలో ఈ రోజు

1916: నటుడు, క్రీడాకారుడు దండమూడి రాజగోపాలరావు జననం
1948: నటి, రాజకీయ నాయకురాలు హేమా మాలిని జననం
1958: రచయిత తెన్నేటి సూరి మరణం
1982: మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ జననం
1984: భారతదేశంలో జాతీయ భద్రతా దళం (NSG) ఏర్పాటు
1990: నెల్సన్ మండేలాకు భారతరత్న పురస్కారం
1990: మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ జననం
*ప్రపంచ ఆహార దినోత్సవం