News April 10, 2025
అమ్రాబాద్: ప్రమాద ప్రదేశం వరకు కన్వేయర్ బెల్టు పొడిగింపు

ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద ప్రదేశం వరకు గురువారం కన్వేయర్ బెల్ట్‌ను పొడిగించారు. దీంతో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి అమ్రాబాద్ మండలం దోమలపెంట గ్రామంలో గల ఎస్ఎల్‌బీసీ సొరంగ ప్రమాద ప్రదేశంలో సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. సొరంగంలో పనిచేస్తున్న సిబ్బందికి సూచనలు సలహాలు అందిస్తూ సహాయక చర్యలను వేగంగా కొనసాగిస్తున్నారు.
Similar News
News December 21, 2025
బలవంతంగా మూత్రాన్ని ఆపుకుంటే?

మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకుంటే కిడ్నీలపై ప్రభావం పడుతుంది. కిడ్నీలో రాళ్లు, ఇన్ఫెక్షన్లు, మూత్ర వ్యవస్థ దెబ్బతినడం వంటి సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. మూత్రాన్ని బలవంతంగా ఆపుకోవడం వల్ల పైలోనెఫ్రిటిస్ అనే పరిస్థితికి దారితీయవచ్చు. ఇది ఒక ఇన్ఫెక్షన్. ఈ వ్యాధికి త్వరగా చికిత్స చేయకపోతే.. మూత్రపిండాలకు నష్టం కలగొచ్చు. మూత్రాశయం నుంచి బ్యాక్టీరియా మూత్రపిండాలకు చేరినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది.
News December 21, 2025
టెన్త్ వార్షిక పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు?

TG: టెన్త్ పరీక్షల <<18515127>>షెడ్యూల్‌లో<<>> మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. పరీక్షల మధ్య గ్యాప్ ఎక్కువగా ఉందని, దానిని తగ్గించాలని ఇటీవల డిమాండ్లు వచ్చాయి. తాజాగా MLC శ్రీపాల్ రెడ్డి సైతం పరీక్షల నిర్వహణ వ్యవధిని తగ్గించాలని CM రేవంత్‌ను కోరారు. ఎగ్జామ్స్ నెల రోజులు నిర్వహిస్తే స్టూడెంట్స్‌పై ఒత్తిడి పడుతుందన్నారు. దీనిపై CM సానుకూలంగా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
News December 21, 2025
గువ్వలచెరువు ఘాట్‌లో తప్పిన భారీ ప్రమాదం

గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో శనివారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. కొందరు అయ్యప్ప భక్తులు శబరిమల నుంచి హైదరాబాద్‌కు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు. ఘాట్ రోడ్డులోకి రాగానే బస్సు బ్రేకులు ఫెయిలయ్యాయి. ఎదురుగా సిమెంట్ లారీ రావడంతో దానిని ఢీకొట్టి బస్సు ఆగింది. లేకపోతే లోయల పడిపోయేది. సిమెంట్ లారీ కారణంగా భారీ ప్రాణ నష్టం తప్పిందని భక్తులు తెలిపారు.


