News April 10, 2025
అమ్రాబాద్: ప్రమాద ప్రదేశం వరకు కన్వేయర్ బెల్టు పొడిగింపు

ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద ప్రదేశం వరకు గురువారం కన్వేయర్ బెల్ట్‌ను పొడిగించారు. దీంతో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి అమ్రాబాద్ మండలం దోమలపెంట గ్రామంలో గల ఎస్ఎల్‌బీసీ సొరంగ ప్రమాద ప్రదేశంలో సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. సొరంగంలో పనిచేస్తున్న సిబ్బందికి సూచనలు సలహాలు అందిస్తూ సహాయక చర్యలను వేగంగా కొనసాగిస్తున్నారు.
Similar News
News February 16, 2026
సంగారెడ్డి: మంజీర నదిలో వ్యక్తి గల్లంతు

మంజీర నదిలో చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. HYD రాజేంద్రనగర్‌కు చెందిన మహమ్మద్ అబ్దుల్ సమద్ ఆదివారం స్నేహితుడితో కలిసి శివంపేట సమీపంలో నదిలో చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యాడు. ఘటనపై సంగారెడ్డి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమద్ కోసం గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ, ఆచూకీ లభించలేదు.
News February 16, 2026
బాపట్లలో పీజీఆర్ఎస్ రద్దు: SP

బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను కొన్ని అనివార్య కారణాల వల్ల ఇవాళ జరిగే కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. ఫిర్యాదుల కోసం సుదూర ప్రాంతాల నుంచి జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చే ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. అర్జీదారులకు కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొన్నారు.
News February 16, 2026
నల్గొండ: MIMలో చేరిన కార్పొరేటర్

నల్గొండ పురపాలక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. 26వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ మొయినా భాయ్ హైదరాబాద్‌లో పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సమక్షంలో MIM తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల సమయంలో టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి 107 ఓట్ల మెజారిటీతో సంచలన విజయం సాధించిన ఆయన ఇప్పుడు తిరిగి పతంగి గూటికి చేరారు.


