News February 12, 2026

అమ్రాబాద్: మల్లెలతీర్థం జలపాతం ఓపెన్ ఎప్పుడంటే?

image

నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం వటర్లపల్లి గ్రామ సమీపంలో ఉన్న మల్లెలతీర్థం జలపాతం శివరాత్రిని పురస్కరించుకొని ఈనెల 14, 15వ తేదీల్లో రెండు రోజులు ఓపెన్ చేసేందుకు అటవీ శాఖ అనుమతించింది. గత వారం Way2Newsలో మల్లెల తీర్థం జలపాతంపై వచ్చిన కథనానికి ఫారెస్ట్ అధికారులు స్పందించారు. జలపాతాన్ని టూరిజం హబ్‌గా మార్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఓపెన్ చేయనున్నట్లు తెలిపారు. SHARE IT

Similar News

News March 7, 2026

ఖమ్మం: మహిళలకు ఉచిత వృత్తి శిక్షణ

image

ఖమ్మంలోని టేకులపల్లి మహిళా ప్రాంగణంలో నిరుపేద మహిళలకు ‘రిటైల్ అండ్ సేల్స్ అసిస్టెంట్’ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు మేనేజర్ విజేత తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన 18-35 ఏళ్ల లోపు వయస్సు, పదో తరగతి అర్హత ఉన్న మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. 3 నెలల శిక్షణతో పాటు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తారు. ఆసక్తి ఉన్నవారు వెంటనే ధ్రువీకరణ పత్రాలతో కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

News March 7, 2026

HYD ఆక్రమణలు, చెత్తతో నిండింది: సీఎం

image

HYD ఆక్రమణలు, చెత్తతో నిండిపోయిందని గొప్ప సుందరమైన నగరంగా HYDను మంచిగా చేస్తానంటే BRS ఒప్పుకోవడం లేదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మేము చేయలేదు నువ్వు చేయొద్దని KTR అంటున్నారని వ్యఖ్యానించారు. నగరాన్ని మంచిగా చేసుకోవడానికి ప్రజా ప్రతినిధులను విదేశాలకు పంపామన్నారు. విమానాశ్రయం కట్టే సమయంలో కొంత వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు అది పెద్ద ఆస్తిగా మారింది. ఎవ్వరూ మూసీలో బతకాలి అనుకోరన్నారు.

News March 7, 2026

CEC వేలు కోసేసే వాడిని.. TMC ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు!

image

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం మమతా బెనర్జీతో CEC చెడుగా ప్రవర్తించారు. CM వైపు వేలు ఎత్తడానికి ధైర్యం చేశారు. CEC కాకపోయుంటే నేను అదే రోజు ఆయన వేలును కోసేసే వాడిని’ అని కోల్‌కతాలో నిరసన కార్యక్రమంలో అన్నారు. SIR విషయంలో గత నెలలో జ్ఞానేశ్ కుమార్‌, మమత మధ్య జరిగిన సంభాషణను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.