News February 26, 2025
అమ్రాబాద్ : శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ నేపథ్యమిదే..!

శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) ప్రాజెక్టుకు 1979లోనే అంకురార్పణ జరిగింది. 1982 జూలై 29న రూ.480 కోట్లతో సొరంగ మార్గం పనులు చేపట్టాలని ఉమ్మడి ఏపీ ప్రభుత్వం జీవో చేసింది. కానీ ఎలాంటి పనులు మొదలు కాలేదు. 22 ఏళ్ల తర్వాత 2005లో దివంగత సీఎం వైఎస్అర్ ఎస్ఎల్బీసీ రూ.2,813కోట్ల అంచనాతో రెండు సొరంగాల నిర్మాణ పనులకు 2006 లో శంకుస్థాపన చేశారు. ప్రస్తుత అంచనావిలువ రూ.4,637.75 కోట్లకు చేరుకుంది.
Similar News
News March 1, 2026
రేపు HYDకి రాహుల్ గాంధీ

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రేపు HYDకు రానున్నారు. ఇక్కడి నుంచి వికారాబాద్ జిల్లా అనంతగిరిలో జరుగుతున్న DCCల శిక్షణ కార్యక్రమంలో వారితో మాట్లాడనున్నారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు రాహుల్ పర్యటన దృష్ట్యా కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. పర్యటనంతా పటిష్ఠమైన భద్రతా చర్యల నడుమ చేపట్టాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది.
News March 1, 2026
భద్రాద్రి రాములోరి తలంబ్రాలు.. ఆర్టీసీ ద్వారా మీ ఇంటికే!

భద్రాచలం రాములోరి తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే చేరవేసేందుకు టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కళ్యాణానికి ప్రత్యక్షంగా రాలేని భక్తుల కోసం కార్గో సేవల ద్వారా ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు కోదాడ డిపో మేనేజర్ బి. శ్రీనివాసరావు తెలిపారు. తలంబ్రాలు కావాలనుకునే భక్తులు కోదాడ బస్ స్టేషన్ లోని 9959226302 నంబర్‌ను సంప్రదించి తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.
News March 1, 2026
నల్గొండ: ఉచిత బ్యూటీషియన్ కోర్సు.. దరఖాస్తుల ఆహ్వానం

నల్గొండలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం (మహిళా ప్రాంగణం)లో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ కోసం దరఖాస్తులు కోరుతున్నారు. మార్చి 4వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఈ కోర్సుకు 8వ తరగతి ఉత్తీర్ణత సాధించి, 18 నుండి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న మహిళలు అర్హులు. ఆసక్తి గలవారు తమ విద్యా అర్హత పత్రాలు, ఆధార్ కార్డు జిరాక్స్, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలతో నేరుగా ప్రాంగణంలో సంప్రదించాలని మేనేజర్ అనిత తెలిపారు.


