News April 9, 2025

అమ్రాబాద్: సలేశ్వరం జాతరకు సాయంత్రం 6 గంటల వరకే అనుమతి

image

నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం సలేశ్వరం లింగమయ్య జాతరను ఏప్రిల్ 11 -13వ తేదీ వరకు అధికారికంగా నిర్వహించనున్నారు. అడవి శాఖ నిబంధనల మేరకు వాహనాలు ఫారెస్ట్‌లోకి ప్రవేశించేందుకు 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అనుమతినిచ్చారు. భక్తులు ఈ గడువులోపే దర్శనం ముగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.

Similar News

News December 4, 2025

గుడివాడ-కంకిపాడు రోడ్డు నిర్మాణం ప్రారంభించండి: బాలశౌరి

image

ఢిల్లీలోని పార్లమెంట్ హాల్‌లో CoSL ఛైర్మన్ ఎంపీ బాలశౌరితో నేషనల్ హైవే ఛైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో గుడివాడ-కంకిపాడు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు, పెడన లక్ష్మీపురం రోడ్డు, తదితర పనులను ఎంపీ బాలశౌరి NHAI ఛైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై ఛైర్మన్ సానుకూలంగా స్పందించి, ఆ పనులను త్వరగా ప్రారంభించాలని సంబంధిత అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు.

News December 4, 2025

పోలీసుల ‘స్పందన’ లేక..

image

ఆకతాయి వేధింపులపై ఫిర్యాదు చేసినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే తమ కుమార్తె <<18465236>>స్పందన<<>> (17) బలవన్మరణానికి పాల్పడి మరణించిందని తల్లిదండ్రులు వాపోయారు. బస్సులో యువకుడి వేధింపులపై తాము ఫిర్యాదు చేస్తే చెన్నేకొత్తపల్లి పోలీసులు పట్టించుకోలేదని, వారు సక్రమంగా వ్యవహరించి ఉంటే తమ బిడ్డను కోల్పోయేవారం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే తమకు కడపుకోత మిగిలిందని బోరున విలపించారు.

News December 4, 2025

ఇంటర్వ్యూతో ICSILలో ఉద్యోగాలు

image

ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్(<>ICSIL<<>>)6 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 9 వరకు అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 10న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.590. నెలకు జీతం రూ.24,356 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://icsil.in