News April 7, 2025
అయిజ: ‘అంబేడ్కర్ ఆలోచన పండుగను జయప్రదం చేద్దాం’

గద్వాల జిల్లా కేంద్రంలో ఈనెల 12న జరిగే అంబేడ్కర్ ఆలోచన పండుగను జయప్రదం చేద్దామని అంబేడ్కరిస్ట్ వరదరాజు పేర్కొన్నారు. అయిజ మండలం కుట్కనూరు గ్రామంలో సోమవారం ఆలోచన పండుగ కరపత్రాలను పంపిణీ చేశారు. అంబేడ్కర్ వాదులు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. అంబేడ్కర్ యువజన సంఘం సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Similar News
News April 21, 2025
కొత్త పోప్‌ను ఎలా ఎన్నుకుంటారంటే? 1/2

పోప్ ఫ్రాన్సిస్ <<16168572>>కన్నుమూయడంతో<<>> 20 రోజుల తర్వాత నూతన క్రైస్తవ మతగురువును ఎన్నుకోనున్నారు. అందుకోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాథలిక్ చర్చిల సీనియర్లు(వారిని కార్డినల్స్ అని పిలుస్తారు) వాటికన్ సిటీలోని సిస్టిన్ చాపెల్ భవనానికి వెళ్తారు. ఎన్నిక సమయంలో వారికి బయటి ప్రపంచంతో సంబంధాలు ఉండవు. ఫోన్, రేడియో, న్యూస్‌పేపర్ల వంటివేవీ అందుబాటులో ఉంచరు.
News April 21, 2025
కొత్త పోప్‌ను ఎలా ఎన్నుకుంటారంటే? 2/2

ఎవరు పోప్ కావాలనుకుంటున్నారో కార్డినల్స్ పేపర్లో రాసి బ్యాలెట్‌లో వేస్తారు. స్పష్టమైన మెజార్టీ రాకపోతే వాటిని కాల్చడం ద్వారా వచ్చే నల్లటి పొగ చిమ్నీ ద్వారా బయటికి వెలువడుతుంది. ఇది ఎంపిక ప్రక్రియ పూర్తికాలేదనేందుకు సంకేతం. మళ్లీ ఓటింగ్ జరుగుతుంది. 2/3 మెజార్టీ వచ్చినవారు పోప్‌గా ఎన్నికవుతారు. ఓ కెమికల్ కలిపి, ఆ బ్యాలెట్ పత్రాలను కాల్చేస్తారు. అలా వెలువడే తెల్లటి పొగ కొత్త పోప్ ఎన్నికకు చిహ్నం.
News April 21, 2025
సీఎంఆర్ బకాయిలను వెంటనే చెల్లించాలి: నిర్మల్ కలెక్టర్

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్ బకాయిలను వెంటనే చెల్లించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం భైంసా ఆర్డీవో కార్యాలయంలో ఆమె రైస్ మిల్లర్లతో సమావేశమయ్యారు. గతంలో మిల్లర్లు ప్రాసెసింగ్‌కు తీసుకున్న ధాన్యానికి సంబంధించి బకాయిలు ఇంకా చెల్లించకపోవడాన్ని గుర్తుచేశారు. రైస్ మిల్లర్ల వారీగా పెండింగ్ బకాయిలను త్వరగా చెల్లించాలన్నారు.