News October 4, 2024

అయిజ: ఈ ప్రాంతంలో నీటి సరఫరా నిలిపివేత

image

అయిజ మున్సిపాలిటీలోని పాత బస్టాండ్‌ ప్రాంతాలకు నేడు తాగునీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు మున్సిపల్ ఇన్‌ఛార్జ్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపాలిటీలోని పాత పోలీస్ స్టేషన్ భవనం వద్ద మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ అయ్యిందని, దానికి మరమ్మతు చేసి కాంక్రీట్ వేశారని, దీంతో శుక్రవారం పాత బస్టాండ్ కాలనీలో మిషన్ భగీరథ తాగునీటి సరఫరాను నిలిపేస్తున్నట్లు చెప్పారు.

Similar News

News December 3, 2025

MBNR: పీయూలో ‘ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్’ కార్యక్రమం

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరు విశ్వవిద్యాలయంలోని ఫార్మసీ ఆడిటోరియంలో ఈ నెల 6న నిర్వహించబోయే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ (ఐపీఆర్) కార్యక్రమం కరపత్రాన్ని వీసీ ప్రొ. జి.ఎన్. శ్రీనివాస్, రిజిస్ట్రార్ పి. రమేష్ బాబు బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం, తెలంగాణ సైన్స్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్‌తో కలిసి నిర్వహించనున్నారు.

News December 2, 2025

MBNR: సైబర్ నేరాలకు పాల్పడితే..1930కు ఫోన్ చేయండి

image

సైబర్ నేరాలకు బారిన పడినప్పుడు వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలి లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయాలి మహబూబ్ నగర్ ఎస్పీ డి.జానకి అన్నారు. ఇవాళ జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘Fraud Ku Full Stop’ అనే నినాదంతో పోలీస్ సిబ్బందితో కలిసి ఎస్పీ ప్రతిజ్ఞ చేశారు. సైబర్ నేరాలు రోజు రోజుకూ రూపం మార్చుకుంటున్నాయి. ఒక్క క్లిక్‌తో పెద్ద నష్టం చోటుచేసుకోవచ్చు. జాగ్రత్తగా ఉండాలన్నారు.

News December 2, 2025

మహబూబ్‌నగర్: జిల్లా ఇన్‌స్పెక్షన్ ప్యానెల్‌కు దరఖాస్తుల ఆహ్వానం

image

మహబూబ్‌నగర్ జిల్లాలోని అర్హత కలిగిన ఉపాధ్యాయులు, హెడ్‌మాస్టర్ల నుంచి జిల్లా ఇన్‌స్పెక్షన్ ప్యానెల్‌ (District Inspection Panel) ఎంపిక కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి (DEO) ఏ.ప్రవీణ్ కుమార్ తెలిపారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు, ఆసక్తి గలవారు పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను డిసెంబర్ 4, 2025 లోపు సమర్పించాలని ఆయన ఆదేశించారు.