News August 21, 2024
అయిజ: గుడిసె గోడ కూలి బాలిక మృతి

గుడిసె మట్టిగోడ కూలి 8 ఏళ్ల బాలిక మృతి చెందిన విషాద ఘటన గద్వాల జిల్లా అయిజలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అయిజలో నర్సింహులు దంపతులు పూరి గుడిసెలో నివాసముంటున్నారు. గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు గుడిసె గోడ తడిసి ముద్దయింది. మంగళవారం అర్ధరాత్రి అందరు నిద్రిస్తుండగా అకస్మాత్తుగా గోడకూలి బాలికపై పడింది. దీంతో బాలిక మృతి చెందింది. నరసింహులు భార్యకు గాయాలయ్యాయి.
Similar News
News November 18, 2025
బాలానగర్: ఫోన్పే చేస్తే.. ఖాతాలో రూ.28 వేలు మాయం

బాలానగర్ మండలం ఉడిత్యాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కిరాణా షాపులో ఫోన్పే ద్వారా రూ.1,260 పంపగా.. కొద్దిసేపటికి అతని ఖాతాలో ఉన్న రూ.28 వేలు మాయమయ్యాయి. దీంతో అవాక్కైన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సై కేసు నమోదు చేశారు. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఎస్సై సూచించారు.

News November 17, 2025
బాలానగర్లో 9.9 ఉష్ణోగ్రత నమోదు

మహబూబ్ నగర్ జిల్లాలో చలి తీవ్రత రోజుకు పెరిగిపోతుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాలానగర్లో 9.9 డిగ్రీల అత్యంత ఉష్ణోగ్రత నమోదయింది. రాజాపూర్ 10.2, గండీడ్ మండలం సల్కర్ పేట, మిడ్జిల్ 10.5, హన్వాడ 11.3 కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 11.4, భూత్పూర్ 11.6, కోయిలకొండ మండలం పారుపల్లి 11.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.