News August 21, 2024
అయిజ: గుడిసె గోడ కూలి బాలిక మృతి
గుడిసె మట్టిగోడ కూలి 8 ఏళ్ల బాలిక మృతి చెందిన విషాద ఘటన గద్వాల జిల్లా అయిజలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అయిజలో నర్సింహులు దంపతులు పూరి గుడిసెలో నివాసముంటున్నారు. గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు గుడిసె గోడ తడిసి ముద్దయింది. మంగళవారం అర్ధరాత్రి అందరు నిద్రిస్తుండగా అకస్మాత్తుగా గోడకూలి బాలికపై పడింది. దీంతో బాలిక మృతి చెందింది. నరసింహులు భార్యకు గాయాలయ్యాయి.
Similar News
News September 14, 2024
నేటి నుంచి రాష్ట్రస్థాయి పోటీలు..ఖోఖో బాలికల జట్టు ఇదే!
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సబ్ జూనియర్స్ ఖోఖో జిల్లాస్థాయిలో ఎంపికలు నిర్వహించగా.. ఈ నెల 14,15న HYDలో జరగనున్న రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొంటారని పిడి బి.రూప తెలిపారు.
బాలికల జట్టు: శ్రీలక్ష్మి,గీతాంజలి,నక్షత్ర(కల్వకుర్తి), శశిరేఖ,శివాని,రేవతి(కర్ని),లౌక్య,శైలజ(పెద్దపల్లి),తనుజ(కున్సి),కావేరి(నంచర్ల),ప్రణత (నారాయణపేట),పల్లవి(తూడుకుర్తి), సహస్ర (జడ్చర్ల),లిఖిత(పెద్దమందడి),స్వప్న (మరికల్).
News September 14, 2024
MBNR: సర్వే చేపట్టినా.. అందని పోడు భూముల పట్టాలు!
సంవత్సరాలు గడుస్తున్నా అటవీ భూముల్లో పోడు సాగు చేస్తున్న రైతులకు పట్టాలు ఇచ్చేందుకు క్షేత్రస్థాయిలో సర్వే చేసినా అధికారులు పట్టాలు పంపిణీ చేయలేదు. దీంతో రైతన్నలు నిరీక్షిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని NGKL, MBNR,WNP, NRPT జిల్లాల్లో పోడు భూములు ఉండగా.. 15,583 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అత్యధికంగా NGKL జిల్లాలో 7,514 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం త్వరగా పోడు పట్టాలను అందించి రైతులు కోరుతున్నారు.
News September 14, 2024
జమ్ములమ్మ ఆలయాన్ని ఆకాశం నుండి చూశారా..?
గద్వాల జిల్లాలోని జమ్మిచెడు జమ్మలమ్మ దేవస్థానాన్ని ఎప్పుడైనా ఆకాశం నుండి చూసారా ? చూస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. దేవస్థానం వారు ఇటీవల డ్రోన్ కెమరా ద్వారా టెంపుల్ వ్యూ ను పై నుండి దేవస్థానాన్ని ఫోటో తీశారు. చుట్టు ముట్టు నిండుగా నీరు ఉండి మధ్యలో ఈ ఆలయం ఉంటుంది .ఓక్క మాటలో చెప్పాలంటే ఈ ఆలయం ద్వీపం వలే ఉంటుంది .