News February 18, 2025

అయిజ: బైక్ కవర్‌లో 6 తులాల బంగారం చోరీ

image

అయిజ మండలం మేడికొండ గ్రామానికి చెందిన వీరేష్ ఓ బ్యాంకులో తాకట్టు పెట్టిన ఆరు తులాల బంగారాన్ని సోమవారం రిలీజ్ చేసుకొని బైక్ కవర్లో ఉంచి ఫర్టిలైజర్ దుకాణం వద్ద పురుగుమందులు కొనుగోలు చేసేందుకు వెళ్ళాడు. మందులు కొనుగోలు చేసి బైక్ వద్దకు వచ్చి చూడగా కవర్‌లో ఉన్న బంగారం మాయమైంది. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు.

Similar News

News November 28, 2025

పిల్లలకు రాగిజావ ఎప్పుడివ్వాలంటే?

image

పసిపిల్లల్లో జీర్ణవ్యవస్థ రోజురోజుకూ వృద్ధి చెందుతుంటుంది. అందుకే తేలిగ్గా జీర్ణమయ్యే రాగిజావను 6-8 నెలల మధ్యలో అలవాటు చేయొచ్చంటున్నారు నిపుణులు. ఈ సమయానికల్లా పిల్లల్లో చాలావరకూ తల నిలబెట్టడం, సపోర్టుతో కూర్చోవడం లాంటి మోటార్‌ స్కిల్స్‌ డెవలప్‌ అయి ఉంటాయి కాబట్టి వాళ్లు ఆ రుచినీ, టెక్‌స్చర్‌నీ గ్రహిస్తారు. మొదట తక్కువ పరిమాణంతో మొదలుపెట్టి, అలవాటయ్యే కొద్దీ పరిమాణం పెంచుకుంటూ వెళ్లొచ్చు.

News November 28, 2025

WPL-2026కు ఆదోని క్రికెటర్ దూరం

image

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మహిళా క్రికెటర్ అంజలి శర్వాణి, మోకాలి సర్జరీ కారణంగా WPL-2026 సీజన్‌కు దూరమయ్యారు. గత మూడు సీజన్లలో యూపీ వారియర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన శర్వాణి, గాయాలతో 8 నెలలుగా ఆటకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ప్రాక్టీస్ మొదలుపెట్టినట్లు ఆమె తండ్రి రమణారావు Way2Newsతో చెప్పారు. వచ్చే జనవరి నుంచి ఆంధ్ర జట్టు తరఫున మళ్లీ బరిలోకి దిగనున్నట్లు వెల్లడించారు.

News November 28, 2025

KNR: గంపగుత్తగా వేస్తే.. ‘గుడి కట్టిస్తాం.. బాసాన్లు ఇస్తాం’

image

సర్పంచ్ ఎన్నికల్లో కుల సంఘాల ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టడానికి ఆశావహులు వింత పోకడలకు వెళ్తున్నారు. సంఘం ఓట్లన్నీ ఒకవైపే వేస్తే కులదేవతకు దేవాలయం, టెంట్ హౌస్ సామగ్రి, వంట పాత్రలు వంటివి ఇస్తామంటూ హామీలు గుప్పిస్తున్నారు. దీంతో గ్రామాల్లోని కుల సంఘాలకు డిమాండ్ పెరిగింది. ఇదే అదనుగా కులపెద్దలు COSTLY డిమాండ్లను ఆశావహుల ముందు పెడుతున్నారు. కాగా ఉమ్మడి KNRలో మొదటి విడతలో 398 GPలకు ఎన్నికల జరగనున్నాయి.