News February 5, 2025

అయిజ: యువకుడి పై కత్తితో దాడి.. గాయాలు

image

అయిజ నరసప్ప గుడి కాలనీకి చెందిన చేనేత కార్మికుడు నేష మోనాష్ పై అదే కాలనీలో నివాసం ఉంటున్న గూడు బాషా అనే వ్యక్తి బుధవారం ఉదయం ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి చేశాడు. దీంతో మోనాష్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. మోనాష్ కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News February 11, 2026

గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు

image

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ఉద్యోగ విరమణ పొందిన ఇద్దరు హోం గార్డులకు ఎస్పీ వకుల్ జిందాల్ నగదు చెక్కులను అందజేశారు. తోటి హోం గార్డులు తమ ఒక రోజు వేతనాన్ని స్వచ్ఛందంగా విరాళంగా సేకరించి సమకూర్చిన రూ.2.31 లక్షలు, రూ. 2.21 లక్షల మొత్తాలను వారికి అందజేశారు. ఎస్పీ వారి సుదీర్ఘ సేవలను కొనియాడారు. హోం గార్డుల మధ్య ఉన్న ఐక్యత, తోటివారికి అండగా నిలిచే గుణాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

News February 11, 2026

BREAKING ఆరిలోవలో మహిళ హత్య

image

విశాఖలోని ఆరిలోవలో ఓ మహిళ బుధవారం హత్యకు గురైంది. స్థానికుల వివరాల మేరకు.. ఆరిలోవ పాత పోలీస్ స్టేషన్ ఎదురుగా దుర్గా బజార్ సమీపంలోని ఇంట్లో లక్ష్మి హత్యకు గురైంది. సమాచారం అందుకున్న సీఐ మల్లేశ్వరరావు, ఎస్సైలు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. త్వరలో వివరాలు వెల్లడిస్తామని సీఐ వెల్లడించారు.

News February 11, 2026

EXIT POLLS.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇలా..!

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 మున్సిపాలిటీల్లో జరిగిన ఎలక్షన్స్‌పై పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్‌‌ను విడుదల చేసింది. ఇందులో కాంగ్రెస్ 3-5 మున్సిపాలిటీల్లో ఛైర్మన్ పీఠం దక్కించుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఇక BRS 2-4 మున్సిపాలిటీల్లో గెలిచే అవకాశం ఉందని తెలిపింది. BJP 2-3, MIM 1, ఇతరులు ఒక్క మున్సిపాలిటీ కూడా గెలిచే అవకాశం లేదని పేర్కొంది. ఈనెల 13న తుది ఫలితాలు. 16న ఛైర్మన్ల ఎన్నిక.