News March 31, 2025
అయిజ: ‘రతంగాపాణి రెడ్డి మన మధ్య లేకపోవడం బాధాకరం’

అయిజ మండలం ఉప్పల గ్రామానికి చెందిన మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు రతంగపాణి రెడ్డి మన మధ్య లేకపోవడం అత్యంత బాధాకరమని అఖిలపక్ష కమిటీ నాయకులు నాగర్దొడ్డి వెంకట రాములు, ఆంజనేయులు, హనుమంతు పేర్కొన్నారు. సోమవారం ఉప్పల గ్రామంలో ఆయన భౌతికదేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులు అర్పించారు. మలిదశ ఉద్యమంలో రాష్ట్ర సాధన ఆవశ్యకత గురించి యువతను చైతన్యం చేశాడని కొనియాడారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.
Similar News
News November 15, 2025
WGL: ఎన్నికల సంఘం మార్గదర్శకాలు విధిగా అమలు చేయాలి!

ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నియమావళి విధిగా పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి అన్నారు. తెలంగాణలోని అన్ని ఇఆర్ఓలు, ఏఆర్ఓలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటరు జాబితా ప్రత్యేక తీవ్ర సవరణ కార్యక్రమం పురోగతి, పెండింగ్లో ఉన్న ఎన్నికల సంబంధిత అంశాలపై ఆయన సమీక్షించారు. జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ భాజ్ పాయ్ పాల్గొన్నారు.
News November 15, 2025
నర్సంపేట నుంచి అన్నవరానికి సూపర్ లగ్జరీ బస్సు

నర్సంపేట RTC డిపో టూర్ ప్యాకేజీలో భాగంగా నర్సంపేట నుంచి 36 సీట్లు గల సూపర్ లగ్జరీ బస్సును ఈరోజు డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ ప్రారంభించారు. ఈ యాత్ర ద్వారక తిరుమల, పిఠాపురం, అన్నవరం, సింహాచలం, విశాఖపట్నం ఆర్కే బీచ్, అంతర్వేది, యానాం మీదుగా ఈనెల 18న రాత్రి 9 గం. వరకు నర్సంపేట చేరుకుంటుందన్నారు. ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరారు.
News November 15, 2025
సూర్యాపేట: కారు బీభత్సం.. ముగ్గురికి గాయాలు (UPDATE)

సూర్యాపేట-జనగామ హైవేపై నాగారం బంగ్లా సమీపంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా కారు కానిస్టేబుల్ను ఢీ కొట్టింది. అనంతరం మరో బైక్ను ఢీ కొట్టడంతో మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ కారును స్పాట్లోనే వదిలిపెట్టి పరారయ్యాడు. కారు నెంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


