News March 8, 2025

అయిజ: రెండు మట్టి టిప్పర్లు పట్టివేత

image

అయిజ పట్టణంలోని కర్నూల్ రాయచూర్ చౌరస్తాలో శుక్రవారం 2 మట్టి టిప్పర్లు పట్టుకున్నట్లు మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రజనీకాంత్ రెడ్డి తెలిపారు. విశ్వసనీయమైన సమాచారం మేరకు అటుగా వెళ్తున్న టిప్పర్లను ఆపి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో తహశీల్దార్ కార్యాలయానికి తరలించి, తహశీల్దార్ జ్యోతి ఆదేశాల మేరకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో అప్పగించామన్నారు.

Similar News

News January 18, 2026

నేటి నుంచి నాగోబా జాతర

image

TG: దేశంలో రెండో అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన ఆదిలాబాద్(D) కేస్లాపూర్ నాగోబా జాతరకు సర్వం సిద్ధమైంది. పుష్యమాస అమావాస్య సందర్భంగా ఇవాళ 10pmకు మహాపూజలతో అంకురార్పణ చేయనున్నారు. మెస్రం వంశీయులు మంచిర్యాల(D)లోని హస్తిన మడుగు నుంచి కాలినడకన సేకరించిన గోదావరి జలంతో నాగోబాకు అభిషేకం చేసి, 7 రకాల నైవేద్యాలు సమర్పించడంతో జాతర ప్రారంభం అవుతుంది. 22న గిరిజన దర్బార్, 25వ తేదీతో జాతర ముగియనుంది.

News January 18, 2026

చిత్తూరు జిల్లాలో భారీగా మద్యం అమ్మకాలు

image

సంక్రాంతి పండుగ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో రూ.15 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగాయి. గతేడాది కంటే ఇది 34% ఎక్కువ. సాధారణంగా జిల్లాలో రోజుకు రూ.కోటి వరకు మద్యం విక్రయాలు జరుగుతాయి. న్యూ ఇయర్ పురస్కరించుకొని రికార్డు స్థాయిలో రూ.14 కోట్ల మద్యం విక్రయాలు జరిగిన సంగతి తెలిసిందే. పండుగల వేళ భారీగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి.

News January 18, 2026

సింహాచలంలో ఇవాళ 6 గంటల వరకే దర్శనం

image

సింహాచలం వరహ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో జనవరి 18వ తేదీ దర్శన వేళలో మార్పులు చేశారు. జనవరి 18న కొండ కింద గల వరాహ పుష్కరిణిలో తెప్పోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే దర్శనం కల్పించనున్నట్లు ఈవో సుజాత శనివారం తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. తెప్పోత్సవం తరువాత స్వామి వారి తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.