News April 16, 2025

అయిజ: 16 నెలలయినా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు: BRSV

image

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 16 నెలలైనా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని బీఆర్ఎస్వీ జిల్లా కన్వీనర్ కురువ పల్లయ్య ఆరోపించారు. మంగళవారం అయిజ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను నిండా ముంచిందని ఆయన అన్నారు. 6,000 ఉద్యోగాలు ఇచ్చి 60 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరుద్యోగులను మోసం చేస్తోందని మండిపడ్డారు.

Similar News

News December 18, 2025

మచిలీపట్నం: తీర ప్రాంత రక్షణపై ఎంపీ బాలశౌరి కసరత్తు

image

మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి బుధవారం కేంద్ర భూమి, శాస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎం.రవిచంద్రన్‌తో భేటీ అయ్యారు. కోడూరు అవుట్‌ఫాల్ స్లూయిస్ పునర్నిర్మాణం, చిన్నగొల్లపాలెం తీరప్రాంత కోత నివారణపై చర్చించారు. దీనిపై క్షేత్రస్థాయి సర్వే నిర్వహించి DPR సిద్ధం చేయాలని, నిధుల కోసం విపత్తు నిర్వహణ సంస్థలను సంప్రదించాలని కార్యదర్శి సూచించారు. ఈ చర్యలతో తీరప్రాంత గ్రామాలకు రక్షణ కల్పించే అవకాశం ఉంది.

News December 18, 2025

రేవంత్ రెడ్డి ఫ్రస్టేషన్ పీక్స్‌కు చేరింది: హరీశ్ రావు

image

పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూశాక సీఎం రేవంత్ రెడ్డి ఫ్రస్టేషన్ పీక్స్‌కు చేరిందని మాజీ మంత్రి హరీశ్ రావు ఎక్స్ ద్వారా విమర్శించారు. రోజురోజుకూ అధికారం చేజారిపోతుందనే సత్యం జీర్ణం కాక రేవంత్ అవాకులు చెవాకులు పేలుతున్నారని ధ్వజమెత్తారు. తన పతనం తప్పదనే భయంతోనే ప్రెస్ మీట్లలో అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కుర్చీ ఊడుతుందనే ఆందోళనలో రేవంత్ రెడ్డి ఆగమాగం అవుతున్నారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.

News December 18, 2025

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సిట్ ఏర్పాటు

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సిట్ ఏర్పాటు చేస్తూ తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(SIT) దర్యాప్తు చేయనుంది. సభ్యులుగా 9 మంది అధికారులు ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పోలీసులకు <<18541312>>లొంగిపోయిన<<>> సంగతి తెలిసిందే.