News April 16, 2025
అయిజ: 16 నెలలయినా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు: BRSV

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 16 నెలలైనా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని బీఆర్ఎస్వీ జిల్లా కన్వీనర్ కురువ పల్లయ్య ఆరోపించారు. మంగళవారం అయిజ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను నిండా ముంచిందని ఆయన అన్నారు. 6,000 ఉద్యోగాలు ఇచ్చి 60 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరుద్యోగులను మోసం చేస్తోందని మండిపడ్డారు.
Similar News
News July 11, 2025
ఒక్క సెకన్‌లో నెట్‌ఫ్లిక్స్ డేటా మొత్తం డౌన్‌లోడ్!

జపాన్ మరో సరికొత్త ఆవిష్కరణ చేసింది. ప్రపంచంలోనే అత్యంత వేగమైన ఇంటర్నెట్ స్పీడ్‌ను సృష్టించింది. సెకనుకు 1.02 పెటా బైట్స్ వేగంతో (పెటా బైట్= 10లక్షల GBలు) ఇంటర్నెట్ డేటాను ట్రాన్స్‌ఫర్ చేసింది. ఈ వేగంతో ఒక్క సెకనులో నెట్‌ఫ్లిక్స్‌లోని డేటా మొత్తం లేదా 150 GB వీడియో గేమ్స్ డౌన్‌లోడ్ అవుతాయి. ఇది భారత సగటు ఇంటర్నెట్ వేగంతో (63.55 Mbps) పోలిస్తే 16 మిలియన్ రెట్లు వేగవంతమైంది.
News July 11, 2025
తెలుగు రాష్ట్రాల న్యూస్ రౌండప్

* AP: ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న CM చంద్రబాబు
* రాష్ట్రంలో లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు: హోంమంత్రి అనిత
* శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం
* TG: మెడికల్ కాలేజీల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ.. దరఖాస్తు తేదీ(ఈ నెల 20-27 వరకు) మార్పు
* కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో ఏడుకు చేరిన మరణాలు
* కాళేశ్వరం అక్రమాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందుకు మరోసారి హరీశ్ రావు
News July 11, 2025
ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో ఎంపీలకు 40% కోటా ఇవ్వాలి: రఘునందన్

సీఎం రేవంత్ రెడ్డికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు బహిరంగ లేఖ రాశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపికలో ఎంపీలకు 40% కోటా కేటాయించాలని లేఖలో డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల లాగానే ఎంపీలు కూడా ప్రజలచే ఎంపికైన ప్రజాప్రతినిధులేనని, వారికి కూడా లబ్ధిదారుల ఎంపికలో సమాన ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. సీఎం గతంలో ఎంపీగా చేశారు కాబట్టి, ఎంపీల ప్రాధాన్యత గురించి ఆయనకు తెలుసునని లేఖలో పేర్కొన్నారు.