News March 9, 2025
అయినవిల్లి: ఆకట్టుకున్న తల్లీకొడుకుల డ్రాయింగ్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిన్న డ్రాయింగ్ టీచర్ వేసిన డ్రాయింగ్ పలువురిని ఆకట్టుకుంది. అయినవిల్లి మండలం కె.జగన్నాథపురంలో ఉన్న శ్రీఉమామహేశ్వర జిల్లా పరిషత్ హైస్కూల్లో డ్రాయింగ్ టీచర్గా పనిచేస్తున్న జి.సత్యనారాయణ మహిళా దినోత్సవం సందర్భంగా డ్రాయింగ్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయనను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, సహచర ఉపాధ్యాయులు అభినందించారు.
Similar News
News October 31, 2025
రూ.కోట్లు కుమ్మరించినా చుక్క వర్షం పడలేదు

కాలుష్యం తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన క్లౌడ్ సీడింగ్(కృత్రిమ వర్షం) ఫ్లాప్ అయింది. ఇప్పటివరకు 3 ట్రయల్స్ నిర్వహించగా చుక్క వర్షం కూడా కురవలేదు. ఒక్కో ట్రయల్కి రూ.35.67 లక్షల చొప్పున రూ.1.07 కోట్లు ఖర్చయింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 9 ట్రయల్స్ కోసం ప్రభుత్వం రూ.3.21 కోట్లు కేటాయించింది. లో సక్సెస్ రేట్ ఉన్న ఈ విధానానికి ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు పెట్టడంపై విమర్శలొస్తున్నాయి.
News October 31, 2025
REWIND: బాగారెడ్డి త్యాగం.. ఇందిరాకు భారీ మెజార్టీ

ఇందిరాగాంధీ గతంలో మెదక్ నుంచి పోటీకి దిగినా ప్రచారం మాత్రం చేయలేకపోయారు. దీంతో ఆమె ప్రచార బాధ్యతలను కాంగ్రెస్ పార్టీకి చెందిన బాగారెడ్డి చేపట్టారు. ఆయన మంత్రిగా ఉండి పూర్తి స్థాయిలో ప్రచారం చేయడం సరికాదని భావించిన బాగారెడ్డి తన పదవికి రాజీనామా చేసి ఊరూరా తిరిగి ప్రచారాన్ని అన్నీ తానై ముందుండి నడిపారు. ఈ ఎన్నికల్లో 2 లక్షలకు పైగా మెజారిటీతో ఇందిరాగాంధీ విజయం సాధించారు.
News October 31, 2025
VZM: పాడుబడిన ఇంటి గోడ కూలి వృద్ధురాలి మృతి

విజయనగరం పట్టణ పరిధి గోకపేట రామాలయం పక్కన పాడుబడిన ఇంటి గోడ కూలి ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. మృతురాలు రెయ్యి సన్యాసమ్మ కుమారుడు కాళీ ప్రసాద్ వివరాల ప్రకారం.. ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్తుండగా దారిలో పాడుబడిన ఇంటి గోడ కూలి మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అదితి ఘటనా స్థలికి వెళ్లారు.


