News February 19, 2025
అయినవిల్లి : పాము కాటుకు గురైన వ్యక్తి సేఫ్

అయినవిల్లి మండలం వీరవల్లిపాలేనికి చెందిన రామకృష్ణ మంగళవారం తాచుపాము కాటుకు గురయ్యాడు. అతణ్ని గ్రామ సర్పంచ్ బుచ్చిబాబు, పంచాయతీ సభ్యుడు నరసింహమూర్తి అయినవిల్లి PHCకి తరలించారు. డాక్టర్ మంగాదేవి సిబ్బందిని సమన్వయం చేస్తూ సకాలంలో వైద్యం అందించారు. దీంతో అతనికి ప్రమాదం తప్పి, ప్రాణాలు కాపాడుకున్నారు.
Similar News
News April 13, 2026
ఖమ్మం: ఫీజు చెల్లింపునకు 20వరకు అవకాశం

ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో ఫెయిలైన విద్యార్థులు ఈనెల 20వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలని డీఐఈవో కె.రవిబాబు సూచించారు. వచ్చే నెల 13 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఈమేరకు ఈనెల 20లోగా ఆయా కళాశాలల్లో ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. అలాగే, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం కూడా ఈనెల 20వరకు tgbie.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
News April 13, 2026
అనకాపల్లిలో ఘనంగా పద్మం సిల్వర్ జువెలరీ ప్రారంభం

పద్మం సిల్వర్ జువెలరీ మరొక శాఖను అనకాపల్లిలో ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి CMR గ్రూపు ఛైర్మన్ మావూరి వెంకటరమణ, మాజీ మంత్రి దాడి వీరభద్ర రావు, ఏపీ యుఎఫ్ఐ డీసీ ఛైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు. పద్మం సిల్వర్ జువెలరీ వారు తమ మరో శాఖను అనకాపల్లిలో ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని, ప్రారంభోత్సవ సందర్భంగా పలు ఆకర్షణీయమైన ఆఫర్లను అందించడం ఎంతో హర్షణీయమని వీరభద్ర రావు అన్నారు.
News April 13, 2026
చిత్తూరు జిల్లాలో రైతు ఆత్మహత్య

చిత్తూరు జిల్లా జీడీనెల్లూరు మండలంలో విషాదం నెలకొంది. రామానాయుడు పల్లికి చెందిన బాబు అనే రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సోమవారం వెలుగు చూసింది. తన భూమిని అన్యాయంగా ఆక్రమించడంతో పాటు కేసుల పేరుతో వేధించారని తెలుస్తోంది. ఈ ఘటనపై పలుమార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి వేధించడంతో ఇలా చేశారని సమాచారం. ఆత్మహత్యకు ముందు రైతు ఓ లేఖ రాశారని స్థానికులు చెబుతున్నారు.


