News January 24, 2025

అయినవిల్లి: యువతి కిడ్నాప్.. కేసు నమోదు 

image

అయినవిల్లి మండలం సిరిపల్లికి చెందిన పదహారేళ్ల యువతిని కిడ్నాప్ చేసిన ఘటనపై కేసు నమోదు చేశామని హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు గురువారం తెలిపారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లికి చెందిన దింపు కార్మికుడు సాయి బుధవారం రాత్రి తన కుమార్తెను కిడ్నాప్ చేశాడంటూ యువతి తండ్రి ఫిర్యాదు చేశారన్నారు. దింపులు తీసేందుకు వచ్చిన సాయి స్థానికంగా ఉంటూ తన కుమార్తెను కిడ్నాప్ చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు.

Similar News

News February 13, 2025

తూ.గో జిల్లా మీదుగా నాలుగు ప్రత్యేక రైళ్ల రాకపోకలు

image

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 14,16,21,23 తేదీలలో జిల్లా మీదుగా పలు రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ప్రకటించారు. 14, 21 తేదీలలో చర్లపల్లి – కాకినాడ టౌన్‌(070310),16,23 తేదీలలో కాకినాడ టౌన్‌ చర్లపల్లి(07032) రైళ్లు నడవనున్నాయని తెలిపారు. ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్లను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

News February 13, 2025

తూ.గో: నాటుకోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్

image

బర్డ్ ఫ్లూ అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది. కోళ్ల రైతులు, పెంపకందారులు బెంబేలెత్తిపోతున్నారు. బర్డ్ ఫ్లూ నాటుకోళ్లపై కూడా తాజాగా ప్రభావం చూపుతోంది. బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా కానూరు అగ్రహారంలో కోళ్ల ఫారాల్లో కోళ్లన్నీ చనిపోయాయి. వైరస్ కానూర్ అగ్రహారంలో నాటుకోళ్లకూ సోకింది. అక్కడ వ్యాధి సోకిన నాటుకోళ్లను పూడ్చివేశారు. దాదాపు 500 నాటుకోళ్లు చనిపోయాయి.

News February 13, 2025

తూ.గో: ఈనెల 14న బహిరంగ వేలం

image

వివిధ ఘటనలో సీజ్ చేసిన 47,274 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని ఈనెల 14న గోపాలపురంలోని ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద బహిరంగ వేలం వేయనున్నట్లు JC చిన్నరాముడు ఒక ప్రకటనలో చెప్పారు. అదే రోజున దేవరపల్లిలో వెంకటేశ్వర రైస్ మిల్ వద్ద కూడా 16.00 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని వేలం వేయనున్నట్లు చెప్పారు. వేలంలో పాల్గొనే వారు ముందుగా రూ.5 వేలు ధరావత్తు చెల్లించాలన్నారు. కిలో బియ్యం రూ.22కి నిర్ణయించామన్నారు.

error: Content is protected !!