News March 25, 2024

అయినవిల్లి సెంటిమెంట్ ఎవరిని అందలం ఎక్కిస్తుందో..?

image

ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు సెంటిమెంట్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. అయినవిల్లి వరసిద్ధి వినాయకుని దర్శనంతో అభ్యర్థులు ప్రచారానికి శ్రీకారం చుడతారు. ప్రచారం, నామినేషన్ల దాఖలు ఇలా ఎన్నికలకు సంబంధించిన ప్రతి అంశంలో వినాయకుని ఆశీస్సులు తీసుకుంటారు. ప్రస్తుత ఎన్నికల్లో కూడా అభ్యర్థులు అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. మరి అయినవిల్లి సెంటిమెంట్ ఎవరిని అందలం ఎక్కిస్తుందో.. వేచి చూడాలి.

Similar News

News January 1, 2026

‘జిల్లాలో 12% పెరిగిన రోడ్డు ప్రమాదాలు’

image

గడిచిన ఏడాదితో పోల్చితే 2025లో రోడ్డు ప్రమాదాలు 12% పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి.2024 లో 309 ప్రమాదా లు సంభవిస్తే 39 మంది మృతి చెందగా, 624 మంది గాయపడ్డారు.2025 లో 309 రోడ్డు యాక్సిడెంట్లైతే 335 మంది మృతి చెందగా 728 మంది క్షతగాత్రులయ్యారని ఎస్పీ నరసింహ కిషోర్ వెల్లడించారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమణ, అతివేగం, హెల్మెట్ ధరించకపోవడం, తాగి వాహనాలు నడపడం మూలంగా ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు.

News January 1, 2026

2025లో జిల్లాలో ఏ నేరాలు ఎన్ని జరిగాయో తెలుసా..?

image

జిల్లాలో గత ఏడాదితో పోల్చితే 2025 సంవత్సరంలో 15% ప్రమాదాలు తగ్గాయని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ వెల్లడించారు. 2024లో 7,586 కేసులు నమోదైతే, 2025లో 6,477 నమోదైనట్లు తెలిపారు. సైబర్ నరాలు 140 నుంచి 123కి, పోక్సో కేసులు 114 నుంచి 110కి, ఆర్థిక నేరాలు 355 నుంచి 302కి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు 101 నుంచి 64కి, మాదకద్రవ్యాల కేసులు 69 ఉంటే 52కి, శారీరిక నేరాలు 76 నుంచి 697కు తగ్గాయన్నారు.

News January 1, 2026

గోదావరిలో దూకబోయిన తల్లి, కూతురు.. కాపాడిన పోలీసులు

image

కొవ్వూరు గోదావరి వంతెన వద్ద ఆత్మహత్యకు యత్నించిన తల్లి, పదేళ్ల కుమార్తెను శక్తి టీం పోలీసులు బుధవారం కాపాడారు. 112 నంబర్ నుంచి అందిన సమాచారంతో తక్షణమే స్పందించిన పోలీసులు వారిని రక్షించారు. కుటుంబ కలహాల వల్లే ఈ అఘాయిత్యానికి సిద్ధపడినట్లు పట్టణ సీఐ పి.విశ్వం తెలిపారు. సకాలంలో స్పందించి ఇద్దరి ప్రాణాలు కాపాడిన పోలీసులను స్థానికులు అభినందించారు.