News October 8, 2024
అయోధ్య రామమందిర పునాది డిజైన్ చేసింది మన పాలకొల్లు వాసే

అయోధ్య రామమందిరానికి పునాది డిజైన్ అందించిన పాండురంగారావు మన ప.గో. జిల్లా వాసే కావడం విశేషం. పాలకొల్లు మండలం గొరింటాడ గ్రామం పాండురంగారావు తాతయ్య స్వస్థలం. ప్రస్తుతం వీరు భీమవరంలో స్థిరపడ్డారు. పాండురంగారావు ఆయన సోదరుని కుమారుడు, కోడలితో కలిసి సోమవారం పాలకొల్లు పట్టణంలోని ముఖదారమ్మ ఆలయంను సందర్శించారు. ఈ సందర్భంగా వారిని సత్కారం చేశారు.
Similar News
News November 25, 2025
ప.గో: ఆన్లైన్లో పందెంకోళ్లు

సంక్రాంతి సమీపించడంతో కోడిపుంజుల విక్రయాలు జోరందుకుంటున్నాయి. బైక్లు, గృహోపకరణాల తరహాలోనే.. సోషల్ మీడియా వేదికగా పుంజుల ఫొటోలు, వీడియోలు, జాతి, బరువు వంటి వివరాలను పోస్ట్ చేస్తూ విక్రేతలు ఆకర్షిస్తున్నారు. పాలకొల్లులో రహదారుల పక్కన విక్రయాలు సాగుతుండగా.. దూర ప్రాంతాల నుంచి విచ్చేసి మరీ కొనుగోలు చేస్తున్నారు. జాతి, సైజును బట్టి ఒక్కో కోడి రూ.1500 నుంచి రూ.20,000 వరకు విక్రయిస్తున్నారు.
News November 25, 2025
భీమవరం: పీజీఆర్ఎస్కు 15 అర్జీలు

పాలకోడేరు మండలం గొల్లలకోడేరులోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 15 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ తెలిపారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, సంబంధిత పోలీస్ స్టేషన్లకు పంపి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.