News October 7, 2024
అయోమయ పరిస్థితిలో కాకాణి: బొబ్బేపల్లి

సర్వేపల్లిలో అనేక అక్రమాలకు పాల్పడి ఇప్పుడు ఓటమితో కాకాణి గోవర్ధన్ రెడ్డి దిక్కుతోచని స్థితిలో ఉన్నారని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొబ్బేపల్లి సురేశ్ నాయుడు అన్నారు. ముత్తుకూరులో ఆయన మాట్లాడారు. కాకాణి చేసిన అక్రమాల ఆనవాళ్లు సర్వేపల్లిలో ఇంకా చెక్కు చెదరలేదని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం ఏమీ చేయకపోగా ఇప్పుడు రోజూ ప్రెస్ మీట్లతో అబద్ధాలు ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు.
Similar News
News September 16, 2025
నెల్లూరు: డీఎస్సీలో 16 మిగులు సీట్లు

నెల్లూరు జిల్లా నుంచి డీఎస్సీ-2025లో ఎంపికైన జాబితాను తాజాగా విద్యాశాఖ వెల్లడించింది. జిల్లాలో 673 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించగా 657 మంది ఎంపికయ్యారు. 16 మిగులు సీట్లు ఉన్నాయి. ఎంపికైన వారికి ఈనెల 19న విజయవాడలో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నియామకపత్రాలు అందించనున్నారు.
News September 16, 2025
నెల్లూరు జిల్లాలో ముగ్గురు మహిళా ఆఫీసర్లు

రాష్ట్ర ప్రభుత్వం నెల్లూరు జిల్లా ఎస్పీగా అజిత వేజెండ్లని నియమించింది. పోలీసు శాఖలో ముగ్గురు మహిళలు ఉన్నత స్థాయిలో ఉండడంతో జిల్లా ప్రజలు ప్రశంసిస్తున్నారు. అడిషనల్ ఎస్పీగా సౌజన్య ఉండగా.. టౌన్ డీఎస్పీగా సింధుప్రియా ఉన్నారు. అత్యంత సవాళ్లతో కూడుకున్న పోలీస్ శాఖలో మహిళా”మణు”లు బాధ్యతలు నిర్వర్తిస్తుండడంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News September 16, 2025
జిల్లాలో ఏడు మండలాల ఎంపీడీవోలు బదిలీలు

నెల్లూరు జిల్లాలోని 7 మండలాల్లో ఎంపీడీవోలు బదిలీ చేస్తూ జిల్లా ప్రజా పరిషత్ సీఈవో జే మోహన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో ఉదయగిరి శ్రీనివాసులు, దుత్తలూరు చెంచమ్మ, నెల్లూరు రూరల్ ఎంవీ రవణమ్మ, చేజర్ల ఎలిషా బాబు, సైదాపురం ఎంవీ రామ్మోహన్ రెడ్డి, కలువాయి ఏ శైలజ, వరికుంటపాడు డీవీ రమణారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.