News June 14, 2024
అయ్యన్నతో మంత్రి అనిత భేటీ
మాజీ మంత్రి నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడితో పాయకరావుపేట ఎమ్మెల్యే మంత్రి వంగలపూడి అనిత విజయవాడలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె అయ్యన్నను సత్కరించారు. మంత్రి పదవి చేపట్టిన అనితకు అయ్యన్న శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు. అందరి సహకారం సమన్వయంతో విశాఖ ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని అనిత అన్నారు. అనకాపల్లి జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు పాల్గొన్నారు.
Similar News
News September 19, 2024
విశాఖ: 4,972 మంది లైసెన్సులు తాత్కాలికంగా రద్దు
బైకర్‌లు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ రాజారత్నం సూచించారు. గోపాలపట్నంలో ఆయన మాట్లాడుతూ.. హెల్మెట్లు ధరించకుండా ప్రయాణిస్తున్న 4,972 మంది డ్రైవింగ్ లైసెన్స్‌లను మూడు నెలలపాటు తాత్కాలికంగా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఈనెల 2 నుంచి 11వ తేదీ వరకు జరిగిన స్పెషల్ డ్రైవ్‌లో 5,543 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
News September 19, 2024
రుషికొండలో ప్రతిరోజూ శ్రీవారి లడ్డూ విక్రయాలు
శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త తెలిపింది. రుషికొండలో గల శ్రీ మహాలక్ష్మీ గోదాదేవి సహిత శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు ఎంతో ప్రీతికరమైన తిరుమల లడ్డూ ఇక నుంచి ప్రతి రోజూ విక్రయించనున్నట్లు ఆలయ ఏఈఓ జగన్మోహనాచార్యులు తెలిపారు. ఇప్పటి వరకు వారంలో మూడు రోజులు మాత్రమే విక్రయించే వారమని, భక్తుల కోరిక మేరకు ఇక నుంచి ప్రతి రోజూ విక్రయిస్తామని ఆయన వెల్లడించారు.
News September 18, 2024
భీమిలి: స్కూల్ బస్సు కింద పడి విద్యార్థి మృతి
భీమిలి మండలం నారాయణరాజుపేట గ్రామంలో విషాదం నెలకొంది. రౌడి గ్రామంలోని నర్సరీ చదువుతున్న బి.వేణు తేజ(5) బస్సు దిగి వెనుక వైపు నిల్చున్నాడు. గమనించని డ్రైవర్ రివర్స్ చేయగా.. ఆ బాలుడు బస్సు వెనుక చక్రాల కింద పడి చనిపోయాడు. బస్సు ఆ చిన్నారి తలపై నుంచి వెళ్లిపోయింది. బస్సుకు క్లీనర్ లేకపోవడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.