News August 21, 2024
అయ్యో పాపం.. శిథిలాల కింద కార్మికుల మృతదేహాలు

అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో చోటు చేసుకున్న ప్రమాదంలో కార్మికులు శిథిలాల్లో చిక్కుకొని మృత్యువాత పడ్డారు. ప్రాథమిక సమాచారం మేరకు రియాక్టర్ పేలడంతో గ్యాస్ ఒక్కసారిగా బయటికి వచ్చింది. ఊపిరాడక కొంతమంది శిథిలాల మధ్యలో మరి కొంతమంది చిక్కుకొని మృత్యువాత పడ్డారు. సుమారు 14 మంది ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. వీరి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అధికారులు వివరాలు పూర్తిగా వెల్లడించాల్సి ఉంది.
Similar News
News November 18, 2025
సింహాచలం: తోటలో చిరు వ్యాపారి ఆత్మహత్య

అప్పులు బాధ తట్టుకోలేక చిరు వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం జరిగింది. ఆరిలోవ ప్రాంతానికి చెందిన జరజాపు వెంకట అజయ్ కుమార్ వ్యాపారం చేసుకుని బతుకుతున్నారు. అప్పులు ఎక్కువ కావడంతో సింహాచలం సమీపంలోని లండగరువు తోటలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గోపాలపట్నం సీఐ ఎల్.సన్యాసినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కంచరపాలెంలో 21న జాబ్ మేళా

కంచరపాలెంలోని జిల్లా ఉపాధి కార్యాలయం NCSCలో ఈనెల 21న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉప ఉపాధి కల్పనాధికారి శ్యామ్ సుందర్ తెలిపారు. 200 పోస్టులకు మేళా చేపడుతుననట్లు ఆయన చెప్పారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, ఎంబీఏ పూర్తి చేసిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. 18-35 ఏళ్ల వయసున్న వారు అర్హులుగా పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు విశాఖ, విజయవాడ, హైదరాబాద్, చెన్నైలో పనిచేయాల్సి ఉంది.