News January 25, 2025

అరకులోయలో చలి ఉత్సవాలకు ఏర్పాట్లు

image

అల్లూరి జిల్లా అరకులోయలో మూడు రోజులపాటు చలి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ దినేశ్ కుమార్ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు ఉత్సవాలు జరుగుతాయన్నారు. మారథాన్, వివిధ రాష్ట్రాల నుంచి గిరిజన సంప్రదాయ కార్నివాల్, పద్మాపురం గార్డెన్‌లో ఫ్లవర్ షో, వివిధ స్టాల్స్, ఫుడ్ స్టాల్ ఉంటాయన్నారు. ప్లాస్టిక్‌ పూర్తిగా నిషేధం అన్నారు.

Similar News

News December 6, 2025

గుంటూరు మీదుగా శిరిడీకి కొత్త వీక్లీ స్పెషల్ రైలు

image

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త అందించింది. తిరుపతి-సాయినగర్ శిరిడీ మధ్య కొత్త వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలును అందుబాటులోకి తెచ్చింది. ఈ రైలు గుంటూరు, తెనాలి, సత్తెనపల్లి వంటి ప్రధాన స్టేషన్‌లలో ఆగుతుంది. ఇది మంగళవారం తిరుపతిలో బయలుదేరి, బుధవారం శిరిడీ చేరుకుని, తిరుగు ప్రయాణం అవుతుంది.

News December 6, 2025

కేంద్ర మంత్రి రామ్మోహన్‌పై విమర్శలు.. తిప్పికొట్టిన ఎంపీలు

image

ఇండిగో వివాదం నేపథ్యంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌పై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు తోటి MPలు మద్దతుగా నిలిచారు. ‘రామ్మోహన్ UDAN పథకాన్ని ప్రోత్సహించారు. దీనివల్ల కొత్త ఎయిర్‌లైన్స్‌కు అవకాశాలు వస్తాయి. ఈ రంగంలో కంపెనీల గుత్తాధిపత్యాన్ని తగ్గించారు. సంక్షోభాల్లో విమానయాన సంస్థలను జవాబుదారీగా చేశారు. ప్రయాణికులకు అండగా నిలబడ్డారు’ అని పెమ్మసాని, లావు ట్వీట్లు చేశారు.

News December 6, 2025

అమలాపురం: అంబేడ్కర్‌కు నివాళులర్పించిన కలెక్టర్

image

సంఘటిత భారతదేశానికి అంబేడ్కర్ రచించిన రాజ్యాంగమే పునాది అని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ అన్నారు. శనివారం అమలాపురంలో అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రతి భారతీయుడు గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి అంబేడ్కర్ అని కొనియాడారు. ముఖ్యంగా యువత ఆయన బోధనలు, ఆశయాలను తప్పక ఆచరించాలని కలెక్టర్ సూచించారు.