News January 25, 2025

అరకులోయలో చలి ఉత్సవాలకు ఏర్పాట్లు

image

అల్లూరి జిల్లా అరకులోయలో మూడు రోజులపాటు చలి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ దినేశ్ కుమార్ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు ఉత్సవాలు జరుగుతాయన్నారు. మారథాన్, వివిధ రాష్ట్రాల నుంచి గిరిజన సంప్రదాయ కార్నివాల్, పద్మాపురం గార్డెన్‌లో ఫ్లవర్ షో, వివిధ స్టాల్స్, ఫుడ్ స్టాల్ ఉంటాయన్నారు. ప్లాస్టిక్‌ పూర్తిగా నిషేధం అన్నారు.

Similar News

News February 9, 2025

సీట్ల తేడా ఎక్కువున్నా ఓట్ల వ్యత్యాసం తక్కువే!

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో BJP, AAP మధ్య ఓట్ల తేడా 2% కంటే తక్కువే ఉంది. BJPకి 45.56% పోలవగా ఆప్‌కు 43.57% వచ్చాయి. కానీ సీట్ల తేడా మాత్రం 26 స్థానాలుగా ఉంది. కాషాయ పార్టీ 48 స్థానాలను గెలుచుకోగా ఆప్ 22 సీట్లకే పరిమితమైంది. అత్యధిక మెజార్టీతో గెలిచిన తొలి ముగ్గురు అభ్యర్థులూ ‘చీపురు’ పార్టీకి చెందినవారే కాగా అత్యల్ప మెజార్టీతో విజయం సాధించిన చివరి ముగ్గురూ కమలం అభ్యర్థులే కావడం గమనార్హం.

News February 9, 2025

రోహిత్ ఫామ్‌పై ఆందోళన లేదు: బ్యాటింగ్ కోచ్

image

టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ గురించి తమకు ఆందోళన లేదని బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ తెలిపారు. ‘రోహిత్‌కు వన్డేల్లో 31 సెంచరీలున్నాయి. గత వన్డే సిరీస్‌లో(vsSL) 56, 64, 35 పరుగులు చేశాడు. టెస్టుల్లో విఫలమయ్యాడు కానీ వన్డేల్లో రన్స్ చేస్తూనే ఉన్నాడు. అతడి బ్యాటింగ్‌తో మాకు ఏ సమస్యా లేదు’ అని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో స్పష్టం చేశారు.

News February 9, 2025

భద్రాద్రిలో 22 జడ్పీటీసీ, 236 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 22 జడ్పీటీసీ, 236 ఎంపీటీసీ స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం కోసం జిల్లా యంత్రాంగం సమాయత్తమవుతోంది. 21 జడ్పీటీసీ స్థానాలు ఉండగా, ఇటీవల భద్రాచలం కొత్తగా ఏర్పడడంతో సంఖ్య 22కు చేరింది. గతంతో పోలిస్తే ఈసారి 16 ఎంపీటీసీ స్థానాలు పెరిగి 236 అయ్యాయి.

error: Content is protected !!