News September 23, 2024
అరకులోయలో నెత్తుటి చారికకు ఆరేళ్లు..!

23/9/2018 మన్యం ప్రజలు మరిచిపోలేని రోజు. అరకు మాజీ ఎమ్మెల్యేలు కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమును మవోయిస్టులు అతి కిరాతంగా చంపిన రోజు. డుంబ్రిగుడ మండలం లివిటిపుట్టు వద్ద ఇద్దరు నేతలను మావోయిస్టులు హతమార్చి నేటికి ఆరేళ్లు గడుస్తోంది. అనంతరం కిడారి కుమారుడు శ్రవణ్ కుమార్ మంత్రిగా పనిచేయగా.. సివేరి కుమారుడు అబ్రహం గత ఎన్నికల్లో TDP తరఫున రెబల్ అభ్యర్థిగా బరిలో దిగి సస్పెన్షన్‌కు గురయ్యారు.
Similar News
News February 24, 2026
రక్షణ రంగ అభివృద్ధికి ఏపీ కీలకం: జి. సతీష్ రెడ్డి

విశాఖ డిఫెన్స్ స్టార్టప్ సదస్సులో రక్షణ శాస్త్రవేత్త జి. సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో ఏపీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. తీరప్రాంతం, పారిశ్రామిక వసతులు రాష్ట్రానికి బలమని, స్టార్టప్స్ భాగస్వామ్యంతో అధునాతన పరికరాల తయారీ సాధ్యమని చెప్పారు. సముద్ర భద్రతే దేశ ఆర్థిక భద్రతకు మూలస్తంభమని, స్వదేశీ సాంకేతికతతో ఇండో-పసిఫిక్‌లో భారత ప్రయోజనాలను కాపాడవచ్చని వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా పేర్కొన్నారు.
News February 23, 2026
విశాఖ: 63వ సారి రక్తదానం చేసి.. మానవతను చాటారు

విశాఖ స్టీల్ ప్లాంట్ జనరల్ ఫోర్‌మాన్ కె.వి.ఎల్.ఎన్.రెడ్డి 63వసారి రక్తదానం చేసి మానవతను చాటారు. రక్త క్యాన్సర్‌తో బాధపడుతున్న 9 ఏళ్ల రమ్యత అచ్యుతకు అత్యవసరంగా అవసరమైన సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్(SDP)ను అగనంపూడి హోమి బాబా ఆసుపత్రిలో దానం చేశారు. ప్లేట్లెట్ కౌంట్ 10 వేలకు పడిపోవడంతో వెంటనే స్పందించారు. B+ గ్రూప్‌నకు చెందిన రెడ్డి రెండోసారి SDP దానం చేయడంతో సహోద్యోగులు అభినందించారు.
News February 23, 2026
పదో తరగతి పరీక్షల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్

విశాఖలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలను పారదర్శకగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని 133 కేంద్రాల్లో 30,633 మంది విద్యార్థులు హాజరవుతున్నారని, అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు, 144 సెక్షన్ అమలు చేయాలని సూచించారు. అలాగే మార్చి 2 నుంచి జరిగే ఓపెన్ స్కూల్ పరీక్షలకు కూడా పక్కా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.


