News September 23, 2024
అరకులోయలో నెత్తుటి చారికకు ఆరేళ్లు..!
23/9/2018 మన్యం ప్రజలు మరిచిపోలేని రోజు. అరకు మాజీ ఎమ్మెల్యేలు కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమును మవోయిస్టులు అతి కిరాతంగా చంపిన రోజు. డుంబ్రిగుడ మండలం లివిటిపుట్టు వద్ద ఇద్దరు నేతలను మావోయిస్టులు హతమార్చి నేటికి ఆరేళ్లు గడుస్తోంది. అనంతరం కిడారి కుమారుడు శ్రవణ్ కుమార్ మంత్రిగా పనిచేయగా.. సివేరి కుమారుడు అబ్రహం గత ఎన్నికల్లో TDP తరఫున రెబల్ అభ్యర్థిగా బరిలో దిగి సస్పెన్షన్‌కు గురయ్యారు.
Similar News
News October 7, 2024
విశాఖ: డిప్యూటీ సీఎంతో ముగిసిన భేటీ
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో విశాఖ ఉక్కు పోరాట కమిటీ నాయకుల భేటీ ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు చర్చలు జరిగాయి. ప్రధానంగా విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయమని కార్మికులు డిమాండ్ చేశారు. ఉక్కు కర్మాగారంలో జరుగుతున్న పరిణామాలను డ్రాఫ్ట్ రూపంలో కార్మిక సంఘాల నాయకుల పవన్ కళ్యాణ్‌కు అందజేశారు.
News October 6, 2024
విశాఖ: Pic oF The Day
విశాఖ కుర్రోడు నితీశ్ కుమార్ రెడ్డి ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అరంగేట్రం చేశారు. ఐపీఎల్‌లో అదరగొట్టిన నితీశ్ బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టీ-20 సీరిస్‌కు ఎంపికయ్యారు. ఆదివారం జరుగుతున్న తొలి మ్యాచ్‌తో అరంగేట్రం చేశారు. టీం సభ్యుల మధ్య టీం ఇండియా క్యాప్ అందుకున్నారు. అతనితో పాటు మయాంక్ యాదవ్‌కు కూడా ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడంతో వీరిద్దరూ టీం ఇండియా క్యాప్‌లతో ఫొటోలు తీసుకున్నారు.
News October 6, 2024
ఇబ్బంది కలగకుండా ఇసుక బుకింగ్ విధానం: కలెక్టర్
ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇసుక బుకింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చినట్లు విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. వార్డు గ్రామ సచివాలయం ద్వారా ఇసుక బుకింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పించామన్నారు. గత నెల 29 నుంచి ఇప్పటివరకు 442 మంది ఇసుక బుకింగ్ చేసుకోగా 357మందికి ఏడు వేల మెట్రిక్ టన్నుల ఇసుకను సరఫరా చేశామన్నారు. ప్రజలే ఇసుకను రవాణా చేసుకునే విధంగా కూడా అవకాశం కల్పించామన్నారు.