News February 23, 2025
అరకులోయలో బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్స్..!

అల్లూరి కలెక్టర్ ఏ.ఎస్ దినేశ్ కుమార్ ఆదేశాల మేరకు అరకులోయ మండలంలో పబ్లిక్ ఎక్కువగా వచ్చే ప్రదేశాలలో బ్రెస్ట్ ఫీడింగ్ కోసం తల్లులకు రూమ్స్ కేటాయించినట్టు సీడీపీఓ శారద పేర్కొన్నారు. బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్స్‌ను అరకులోయ తహశీల్దార్ కార్యాలయం, ఎంపీడీవో ఆఫీసు, పెదలబుడు సచివాలయం, అరకు రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసి, పోస్టర్లు అంటించామని సీడీపీఓ తెలిపారు. తల్లులు ఈ సౌకర్యాలను గమనించి వాడుకోవాలని ఆమె కోరారు.
Similar News
News March 15, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> జిల్లా వ్యాప్తంగా సిపిఎం నేతల ధర్నా > రైలు కిందపడి యువకుడు మృతి > ప్రభుత్వంపై పోరాటం చేస్తాం జనగామ ఎమ్మెల్యే > రేపటి సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే కడియం > ప్రశాంతంగా ఎనిమిదవ రోజు ఇంటర్ పరీక్షలు > కొమురవెల్లికి బస్సులు లేక ప్రయాణికుల ఇక్కట్లు > 5వ రోజుకు చేరుకున్న ఎమ్మార్పీఎస్ నేతల నిరాహార దీక్ష > హామీలను నెరవేర్చిన తర్వాతే సీఎం జిల్లాలో అడుగు పెట్టాలి: రమేష్
News March 15, 2025
జమ్మికుంట: రైలుకింద పడి వ్యక్తి మృతి

జమ్మికుంట రైల్వేస్టేషన్లో వ్యక్తి మృతిచెందాడు. రైలు ఎక్కుతుండగా కొమురయ్య (50) జారిపడి చనిపోయాడు. మృతుడు రైల్వేలో గ్యాంగ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మృతుడు స్వస్థలం హనుమకొండ జిల్లా సోమిడి.
News March 15, 2025
ఎముకలు దృఢంగా ఉండాలంటే…

మన ఎముకలు బలంగా ఉండాలంటే ఏం చేయాలి? పోషకాహార నిపుణుల సూచనల ప్రకారం.. కాల్షియంతో పాటు డీ, కే విటమిన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినాల్సి ఉంటుంది. అలాగే మెగ్నీషియం, ఫాస్పరస్ కూడా కొంత మోతాదులో అవసరమే. అంజీర్, సముద్రపు చేపలు, బాదంపప్పులో ఇవన్నీ లభిస్తాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని పెంచడంలో ఉపకరిస్తాయని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు.